దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు అంటే ప్రేక్షకుల్లో అదో ప్రత్యేకమైన క్రేజ్. ఎందుకంటే అందరు దర్శకుల లాగా  రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు సాదాసీదాగా ఉండవు. రాజమౌళి సినిమాలన్నీ భారీ బడ్జెట్తో ఇండస్ట్రీ రికార్డులే  టార్గెట్గా తెరకెక్కుతున్నాయి. అయితే రాజమౌళి తన సినిమా తారాగణం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం తెలిసిందే.ఎవరిని తీసుకుంటే సినిమాకి కలిసి వస్తుంది అన్నది రాజమౌళికి స్పష్టంగా తెలుసు. అయితే రాజమౌళి సినిమాల్లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఒక్కసారి మించి రిపీట్ అవ్వలేదు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం రాజమౌళి కి లక్కీ హీరోయిన్ గా మారిపోవడమే  కాదు ఏకంగా రెండు మూడు సినిమాల్లో రిపీట్ అయింది కూడా. 

 


 ఆ హీరోయిన్ ఎవరో కాదు తన క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టి... తెలుగు ప్రేక్షకులందరికీ లేడీ సూపర్ స్టార్ గా... ఎంతోమంది ప్రేక్షకులకు అందాల దేవత గా మారిపోయిన అనుష్క. అనుష్క రాజమౌళి కాంబినేషన్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే రెండు మూడు సినిమాలు తెరకెక్కాయి. మామూలుగా అయితే రాజమౌళిహీరోయిన్ ని  ఒక సినిమాకు మంచి రిపీట్ చేయడు  కానీ అనుష్క విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు రాజమౌళి. ఇక రాజమౌళి ఇప్పుడు వరకు తెరకెక్కించిన సినిమా లో ఎక్కువ సార్లు రిపీట్ అయింది కూడా అనుష్క అనే చెప్పాలి. 

 


 రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమా అప్పట్లో విడుదలై ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ  సినిమాలో  రవితేజకు జోడీగా అనుష్క నటిస్తోంది. తనదైన నటనతో ఈ సినిమాలో రక్తి కట్టించి ప్రేక్షకులను మెప్పిస్తుంది అనుష్క. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విజయంలో వెన్నుముక లా మారిపోయింది. ఇక బాహుబలి 2 సినిమా లో కూడా అనుష్క పాత్ర ఎంత కీలకంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు తన సినిమాల్లో హీరోయిన్ల కు ఎక్కువ ప్రాధాన్యత ఉండదని కానీ బాహుబలి లో కేవలం అనుష్క హీరోయిన్ కాబట్టి ఆ పాత్రకు అంత ప్రాధాన్యత ఇచ్చాను అంటూ రాజమౌళి ఒకానొక సందర్భంలో కూడా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: