బాలీవుడ్ భామ పూజా కుమార్ కోలీవుడ్ మీడియా మీద కస్సు బస్సులాడుతుంది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విశ్వరూపం 1, 2 సినిమాల్లో నటించిన పూజా కుమార్ కమల్ హాసన్ బర్త్ డే పిక్స్ లో ఉండటం వల్ల కమల్, పూజా కుమార్ ల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రాశారు. రీసెంట్ గా గౌతమి కూడా కమల్ కు దూరమవడంతో ఆ వార్తలకు ఇంకాస్త బలం చేకూరింది. అయితే కమల్ హాసన్ తో తాను దిగిన ఫోటో మీద మీడియా చేసిన రచ్చకు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది పూజా కుమార్. కలిసి ఫోటో దిగినంత మాత్రానా అలా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. 


కమల్ హాసన్ తో సినిమా చేసే టైం లో అయన ఫ్యామిలీ కూడా తనకు దగ్గరైంది. ఆ చనువుతో ఫోటో దిగానే తప్ప మీరనుకుంటున్న ఎలాంటి రిలేషన్ మా మధ్య లేదని అంటుంది పూజా కుమార్. అంతేకాదు ఇలాంటి వార్తలు రాయడం వల్ల తమ లాంటి వారిని ఇబ్బంది పెట్టడం తప్ప మరేమి లేదని అంటుంది పూజా కుమార్. కమల్ హాసన్, పూజా కుమార్ మధ్య సీక్రెట్ రిలేషన్ పై ఆమె సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అలంటి వార్తలు రాయడంపై పూజా కుమార్ మండిపడ్డారు. 


కలిసి ఫోటో దిగినంత మాత్రానా ఇలాంటి చెత్త వార్తలు రాస్తే ఎలా.. సెలబ్రిటీస్ కు ఒక ప్రయివేట్ లైవ్ ఉంటుంది. అలాంటివి కూడా న్యూస్ లు చేసి మీరు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు అంటూ గరం గరంగా మాట్లాడింది పూజా కుమార్. మొత్తానికి కమల్ విషయంలో మీడియా చేసిన అతికి పూజా కుమార్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. తప్పకుండా పూజా కుమార్ మాట్లాడిన దానిలో తప్పేమి లేదని కొందరు ఆమెకు సపోర్ట్ మాట్లాడుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: