మాటల  మాంత్రికుడు త్రివిక్రమ్  కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నప్పటికీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలు కూడా అందరికంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలో డైలాగులు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాయి. ఎక్కువగా యూత్ని ఆకర్షించే విధంగా ఉంటాయి డైలాగులు. ప్రాస యాసతో కూడిన డైలాగులతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి . త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన డైలాగ్ లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ సృష్టించాయి అని చెప్పాలి. అయితే చాలా మంది హీరోయిన్లకు కొంతమంది ఫేవరెట్ దర్శకులు ఉంటారు. 

 


 ఇక కొంతమంది హీరోయిన్  దర్శకుడు కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు బాగా ఫేవరెట్ గా మారిపోతూ ఉంటుంది. ఇలా ప్రేక్షకులకు ఫేవరేట్  గా మారిపోయిన కాంబినేషన్ లలో ఒకటి అక్కినేని వారి కోడలు సమంత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ ఏదైనా సినిమాలో రిపీట్ అయింది అంటే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఫుల్ టైం ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే త్రివిక్రమ్ యాస ప్రాసలతో  కూడిన డైలాగులకు సమంత నటన సరిగ్గా సరిపోతుంది. అందుకే ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ ఫేవరెట్గా మారిపోతూ ఉంటుంది. 

 

 అయితే సమంత త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపుగా రెండు మూడు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో సమంత తన నటనతో ఆకట్టుకోవడమే కాదు త్రివిక్రమ్ డైలాగ్ లు చెబుతూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మరో సినిమా నితిన్ హీరోగా తెరకెక్కిన ఆ ఆ సినిమా. ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నటించిన సమంత... తనదైన క్యూట్ క్యూట్ యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. దీంతో  సమంత కి దర్శకుడు త్రివిక్రమ్ ఫేవరెట్ దర్శకుడిగా మారిపోయాడు. అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఎక్కువగా తన సినిమాల్లో సమంతను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: