తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో ప్రాసతో కూడిన పంచ్ డైలాగులతో సినిమాలను ఇస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే తెలుగు ప్రేక్షకులందరూ త్రివిక్రమ్ ను  మాటల మాంత్రికుడు అంటుంటారు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ చాలా మంది హీరోలతో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ చేతిలో పడిన ఎంతో మంది హీరోయిన్లు కూడా... స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగారు. ఇలా త్రివిక్రమ్ తో రెండు మూడు సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ప్రస్తుతం ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే కనిపిస్తోంది. 

 


 మొన్నటికి మొన్న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తన క్యూట్ క్యూట్ అందాలతో... సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కూడా సినిమా విజయంలో వెన్నుముక లా  నిలిచింది. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పూజాహెగ్డే స్టార్ హీరోయిన్గా మరింత క్రేజ్ సంపాదించింది. అటు త్రివిక్రమ్ కి కూడా పూజాహెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది

 


 ఆ తర్వాత మొన్నటికి మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అల వైకుంఠపురములో ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించింది . ఇక ఈ సినిమా కూడా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అటు పూజా హెగ్డే తన అందాలతో ఏకంగా ఈ సినిమాలో అందాల దేవత లా కనిపించింది ప్రేక్షకులకు. దీంతో పూజా హెగ్డే ని చూస్తూ మెస్మరైజ్ అయిపోయారు ప్రేక్షకులు. దీంతో అటు త్రివిక్రమ్కి పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిపోవడమే  కాదు... ఇటు పూజా హెగ్డే కి కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లక్కీ దర్శకుడిగా మారిపోయాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: