తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కెరీర్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మామయ్య మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఒడిసిపట్టిన మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ తనదైన కామెడీ టైమింగ్ తో యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మెగా హీరోలు సాయి ధరంతేజ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక కెరీర్ మొదట్లో హై స్పీడ్ తో దూసుకు పోయిన వరుణ్ తేజ్  తర్వాత వరుస సినిమాలతో సతమతమయ్యాడు... ఇక ఆ తర్వాత చిత్రలహరి సినిమా తో ట్రాక్ లో పడ్డ ఈ మెగా మేనల్లుడు మరోసారి మొన్నటికి మొన్న ప్రతి రోజు పండగే సినిమాతో  మళ్లీ ఫామ్  లోకి వచ్చేసాడు. 

 

 ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కి జోడిగా నభ నటేష్ నటిస్తుంది . ఇక సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలైంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారిపోతుంది. కాగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఇక తాజాగా సోలో బ్రతుకే సో బెటర్ అనే తన సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్ గురించి హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... మొదటి సాంగ్ ని ఎంజాయ్ చేయండి.. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి నో పెళ్లి సాంగ్ విడుదలైంది. ఇది సింగిల్ గా ఉన్న ప్రతి ఒక్కరికి డెడికేట్ చేయబడుతుంది. అంతేకాకుండా వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి కి హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ లో ఇద్దరు నాకు అండగా నిలిచారు. అంతేకాకుండా నా హీరోయిన్ నభ  నటేష్  కి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్  పెట్టారు సాయి ధరంతేజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: