విక్టరీ వెంకటేష్, నాచురల్ స్టార్ నాని కలిసి సినిమా చేస్తే.. అబ్బో ఇద్దరు తమ నాచురల్ నటనతో ఆకట్టుకుంటారు. అంతేకాదు ఇద్దరు ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఏడిపిస్తారు కూడా. ఎఫ్-2తో మళ్ళీ తిరిగి తన ఫామ్ లోకి వచ్చిన వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో నారప్ప సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ ఆయిన అసురన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అదిరిపోయింది. 


ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్సినిమా చేస్తాడు అన్నది ఇంకా కన్ఫర్మ్ అవలేదు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో వెంకటేష్ సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందిన మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా ఉంటాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ డైరక్షన్ లో ఈ ఇద్దరు కలిసి నటిస్తే తప్పకుండా సినిమా అంచనాలను మించి ఉంటుందని చెప్పొచ్చు. 


ప్రస్తుతం నాని కూడా టక్ జగదీశ్ సినిమా పూర్తి చేశాక మరో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తాడన్నది తెలియదు కానీ వెంకటేష్ తో పాటుగా నాని కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం పక్కా అని అంటున్నారు. వెంకటేష్, నాని కలిసి చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కు సూపర్ హిట్లు ఇచ్చాడు కానీ డైరక్టర్ గా మారాక మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. త్రివిక్రమ్ డైరక్షన్ లో వెంకటేష్ సినిమానే హైలెట్ అనుకుంటుంటే ఆ సినిమాలో నాని కూడా అంటే ఇక ప్రేక్షకులకు పండుగ అన్నట్టే.                    

 

మరింత సమాచారం తెలుసుకోండి: