టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన ‘అరుంధతి’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ మూవీలో జేజెమ్మగా అనుష్క నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు.  ఇక ఇందులో అఘోరాగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నటన విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకున్నారు.   రీల్ లైఫ్ లో విలన్ గా నటించినా.. రియల్ లైఫ్ లో మాత్రం సూనూసూద్ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.  కరోనాతో నానా కష్టాలు పడుతున్న వలస కూలీలకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ప్రజారవాణా లేకపోవడంతో కాలినడకన వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

 

అలాంటి వారిని ఆదుకుంటూ టాలీవుడ్ ప్రముఖ విలన్.. సోనుసూద్  గత కొన్ని వారాలుగా సొంతంగా బస్సులను ఏర్పాటుచేసి వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు సోషల్ మాద్యమాల ద్వారా సోనూ సూద్ సహాయం కోరుతున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి ఆయన స్పందిస్తున్నారు. అంతే కాదు తన ఫైవ్ స్టార్ హోటల్ ని కూడా వాడుకోవొచ్చు అని మంచి మనసు చాటుకున్నారు.  సోనూసూద్ చేస్తున్న సేవలకు గాను ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రీల్ లైఫ్ లో విలన్ అయిన రియల్ లైఫ్ లో హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇలా ఓ వ్యక్తి పోస్ట్ కి  సోనూ సూద్‌ను స్పందించగా.. ఆ పోస్ట్ కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీ పోస్ట్ చేశారు. సోనూ సూద్ చేస్తోన్న సాయాన్ని ప్రశంసించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘వృత్తిపరమైన సహచరుడిగా గడిచిన రెండు దశాబ్దాలుగా మీ గురించి నాకు తెలుసు. మీరొక నటుడిగా ఎదగడాన్ని చూసి ఎంతో సంతోషించాను. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది. మీవంతు సాయం చేసి ఎంతోమందికి అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని స్మృతి ఇరానీ తన సోషల్ మాద్యంలో పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: