భారత్ లో అతిపెద్ద సినీ పరిశ్రమల్లో తమిళ పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. కోలీవుడ్ గా భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేస్తోంది. కొత్త తరహా ప్రయోగాలకు వెరవని సీని పరిశ్రమల్లో తమిళ సినమా కూడా ఉంటుంది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో అన్ని పరిశ్రమల్లానే తమిళ పరిశ్రమకు కూడా పెద్ద దెబ్బే తగిలింది. ఈ సమయంలో పరిస్థితులు చక్కబడ్డాక సినిమా పరిస్థితి ఏంటన్న విషయంపై అన్ని భాషల్లోనూ సందిగ్ధం నెలకొంది. అయితే.. ఇందుకు తమిళ పరిశ్రమ ఓ వినూత్నమైన ఆలోచనతో ముందకు వెళ్లబోతోంది.

 

 

ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత ఆర్బీ చౌదరి ముందుకొచ్చారు. మరో నిర్మాత పిరమిడ్ నటరాజన్, ధియేటర్ ఓనర్ తిర్పూర్ సుబ్రమణియన్ తో కలిసి 30రోజుల్లో పూర్తయ్యేలా ఓ సినిమా ప్లాన్ చేశారు. అయితే.. ఈ సినిమాకు వీరు పెట్టుబడి పెట్టడం లేదు. ఇండస్ట్రీ నుంచి వీరు విరాళలు సేకరించబోతున్నారు. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కలిగించేందుకు చేస్తున్న ఈ ప్రయోగంపై ఆసక్తి కలిగిన వారి నుంచి విరాళాలు కోరుతున్నారు. ఈ సినిమాను 2కోట్ల పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకున్నారు. సత్యరాజ్, పార్తీబన్  ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. సీనియర్ డైరక్టర్ కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

 

 

ఈ సినిమాను ధియేటర్లు ఓపెన్ చేసేలోపు పూర్తి చేసి ధియేటర్లలోనే విడుదల చేస్తారు. 100 రోజుల అనంతరం ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ఎవరికీ పారితోషికాలు ఉండవు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో షేర్ ఇవ్వనున్నారు. తమిళ పరిశ్రమలో ఇదొక వినూత్న ప్రయోగమని అంటున్నారు. నిజంగానే ఇదొక మంచి ప్రయోగమని చెప్పాలి. మరి వీరి ఆలోచన మేరకు ఎవరు ఎంత విరాళం ఇస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: