ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమ చూపు మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమా పైనే ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు  సమాచారం. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు  మొదటి సారి కలిసి మల్టీస్టారర్ గా నటిస్తున్న సినిమా కావడం... వీరిద్దరూ స్వతంత్ర సమరయోధుల పాత్రలో నటిస్తుండడం.. ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చి పెడుతుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 8 న  విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 


 ఎంత ఆలస్యమైనా  అవుట్ పుట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు  రాజమౌళి అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కూడా రాజమౌళి అలాగే ఉన్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది  ఈ సినిమా. ఇంతలో కరోనా  వైరస్ వ్యాప్తి జరగడం..లాక్ డౌన్  అమలు కావడంతో.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కాస్త వాయిదా పడడంతో మిగిలిన భాగం పెండింగ్లో ఉండిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రబృందం ప్రకటించిన విధంగా ఈ సినిమా విడుదల కావడం కష్టమే అని అర్ధమైపోయింది. మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడవచ్చు అని వార్తలు కూడా వచ్చాయి. 

 

 ఈ నేపథ్యంలో ఇలా వస్తున్న వార్తలన్నింటికీ  చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట జక్కన్న . ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భాగంలో కొంతమేర మార్పులు చేసి సత్వరంగా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అవుట్ డోర్  షెడ్యూల్స్  కొన్ని తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర బృందంతో చర్చలు కూడా జరపగ  అందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక చిత్రీకరణ జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే... ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న భాగాన్ని సత్వరంగా చిత్రీకరణ జరిపి... ముందుగా అనుకున్న విధంగా జనవరి 8వ తేదీన విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అయితే కొద్దిగా మార్పులు చేయడం కారణంగా ఈ సినిమాపై  ఎలాంటి ప్రభావం ఉండబోదని రాజమౌళి భావిస్తున్నారట. ఇక ఈ వార్తతో అటు  నందమూరి మెగా అభిమానుల్లో  ఎంతగానో ఉత్సాహం ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: