వరుసగా ఆరు సినిమాలు ప్లాపులతో కెరియర్ డైలమాలో పడ్డ మెగా మేనళ్లుడు సాయి తేజ్ ఫైనల్ గా చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కాడు. కిషోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్ ఆ తర్వాత మారుతి డైరక్షన్ లో వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు సాయి తేజ్. ఈ సినిమాను నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని న నిర్మిస్తున్నారు. 

 

ఈ సినిమాకు సంబందించిన టీజర్ అప్పట్లో హడావిడి చేయగా లేటెస్ట్ గా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నో పెళ్లి అంటూ మొదలైన ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అయ్యింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మొదటి సాంగ్ సోసోగానే ఉందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్, రానా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా సాంగ్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. ట్యూన్ మాత్రమే కాదు లిరిక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు హిట్లు పడగానే తేజ్ మళ్ళీ లైట్ తీసుకున్నాడా అన్న టాక్ వినిపిస్తుంది. 


సినిమాకు బలాన్ని ఇచ్చేది సాంగ్స్.. రిలీజ్ ముందు సినిమాను సూపర్ హిట్ వైపు నడిపించేది కూడా ఈ పాటలే. అల వైకుంఠపురములో సాంగ్స్ సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషనల్ గా మారాయి. రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విషయంలో ఆ మేజిక్ రిపీట్ చేస్తాడని అనుకోగా మొదటి సాంగ్ తోనే డిజప్పాయింట్ చేశాడు థమన్. సాంగ్స్ ఎలా ఉన్నా స్టోరీ అయినా కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: