లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. దాదాపు రెండు నెలలకు పైగా థియేటర్ లు తెరుచుకున్న పరిస్థితి కనబడటం లేదు. ప్రస్తుతం ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కరోనా వైరస్ జనాలు గుంపులుగుంపులుగా ఉండే చోట ఎక్కువగా విస్తరించే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు సినిమా ధియేటర్ లు ఓపెన్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాయి. ఇదిలా ఉండగా ఒకవేళ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా ప్రజలలో నెలకొన్న భయాందోళనలు వల్ల సినిమా థియేటర్లకు జనాలు వచ్చే అవకాశం లేని పరిస్థితి. ఇటువంటి సమయంలో చాలావరకు సమ్మర్ టార్గెట్ చేసుకుని రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి.

 

పరిస్థితి అటు ఇటు కాకుండా ఉండటం తో చాలా వరకు రిలీజ్ చేయాల్సిన సినిమాల నిర్మాతలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ లాంటి వండర్ సినిమా తీసిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సారథ్యంలో లిమిటెడ్ బడ్జెట్ లో సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాను నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ వెంకటేష్ మహాసినిమా చిత్రీకరించడంతో లాక్ డౌన్ ముందే  సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. అప్పట్లోనే ఏప్రిల్ 17వ తారీఖున సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

 

ఇటువంటి సమయంలో వైరస్ ఒక్కసారిగా రావడం, ఉన్న కొద్ది టైం వేస్ట్ అవడంతో పాటు సినిమా థియేటర్ ల విషయంలో క్లారిటీ లేకపోవటంతో డైరెక్ట్ ఓటిటిలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారట. దీంతో ఈ విషయం తెలుసుకుని సినిమా ప్రేక్షకులు గుండె బరువెక్కి లాంటి వార్త ఇది అని అంటున్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా థియేటర్లో చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. అలాంటిది ఆ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాను థియేటర్లో కాకుండా ఓటిటిలో చూడాలంటే కొద్దిగా బోర్ గా ఉంటుంది అని అంటున్నారు . ఇదిలా ఉండగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’  సినిమా నిర్మాతలు మంచి లాభానికే నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థకు సినిమాను అమ్మేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: