తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్న తదుపరి మూడు సినిమాలకు నిర్మాతలు దొరికారు. అందులో  విజయ్ 65వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఏఆర్ మురగదాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా  థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ  తుపాకికి సీక్వెల్ గా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. ఈసినిమా తరువాత  విజయ్ తన 66వ చిత్రాన్ని తేనాండాళ్ స్టూడియోస్ బ్యానర్ లో చేయనుండగా 67వ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించనున్నాడు.మరి ఈరెండు సినిమాలను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. 
 
 
ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈపాటికే విడుదలకావాల్సివుండగా కరోనా  వల్ల వాయిదాపడింది దాంతో దీపావళికి ఈ సినిమాను  విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదలకానుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ , కాలేజీ ప్రొఫెసర్ గా కనిపించనుండగా మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తుండగా ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
 
 
ఈచిత్రం పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. మాస్టర్ ను తెలుగు లో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు విడుదలచేయనున్నాడు అందుకు గాను తెలుగు హక్కులను  9కోట్లకు దక్కించుకున్నాడు. ఇటీవల  సర్కార్, విజిల్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో  విజయ్ మార్కెట్ అమాంతం పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: