లాక్ డౌన్ షరతులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. పరిస్థితులు చక్కబడకున్నా కొన్ని ఆంక్షల సడలింపు తప్పనిసరి అవుతోంది. మెల్లమెల్లగా ఆర్ధిక కార్యకలాపాలు మొదలువుతున్నాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. తెలుగు పరిశ్రమ విషయానికే వస్తే చిరంజీవి నేతృత్వంలో వరుసగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, సీఎం కేసీఆర్ తో సమావేశం జరిగాయి. అతి త్వరలోనే కొన్ని ఆంక్షలతో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో మేకర్స్. యాక్టర్స్ అంతా షూటింగ్ ల కోసం సిద్ధమవుతున్నారు. ఎప్పుడు షూటింగ్ షూరూ అన్నా అటెండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

 

రెండు నెలల క్రితం ఆగిపోయిన షూటింగులు తిరిగి మొదలుకానున్నాయి. ఈనేపథ్యంలో ఏయే సినిమాలు ఎంత షూటింగ్ బ్యాలన్స్ లో ఉన్నాయో పరిశీలిస్తే.. చిరంజీవి ఆచార్య 60%, విజయ్ ఫైటర్ 60%, బాలకృష్ణ మూవీ 60%, నాని టక్ జగదీశ్ 60%, గోపీచంద్ సీటీమార్ 50%, ప్రభాస్ మూవీ 50%, నాగార్జున వైల్డ్ డాగ్ 50%, ఆర్ఆర్ఆర్ 30%, వెంకటేశ్ నారప్ప 30%, పవన్ వకీల్ సాబ్.. 25%, నితిన్ రంగ్ దే 20%, రవితేజ క్రాక్ 10%, నాగచైతన్య లవ్ స్టోరీ 10%.. ఇలా వివిధ సినిమాలు షూటింగ్ ప్రోగ్రస్ ఓ ఉన్నాయి. బన్నీ పుష్ప సినిమా 10శాతం మాత్రమే జరిగింది.

 

 

ఇక నాని వి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, అఖల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇవన్ని లైన్లో పడితే సినీ పరిశ్రమ మళ్లీ కళకళలాడుతుంది. షూటింగ్స్ ప్రారంభమైతే కార్మికులకు ఆర్ధిక కష్టాలు తప్పుతాయి. తగిన జాగ్రత్తలతో ధియేటర్లు కూడా ఓపెన్ అయితే వినోద రంగం కుదుపటడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: