కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. ఎవరు ఊహించని ఈ విపత్తుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో సమ్మర్ కానుకగా సినిమాల పరంగా కొన్ని కోట్ల వ్యాపారం జరిగేది. అయితే ఈ ఏడాది కరెక్ట్ గా సమ్మర్ స్టార్ట్ అయిన సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో లాక్ డౌన్ అమలు చేయటంతో జరగాల్సిన సినిమా షూటింగులు మరియు సినిమా థియేటర్లు అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి సమయంలో ప్రస్తుతం జూలై మాసంలో గాని ఆగస్టు మొదటి వారంలో గాని సినిమా థియేటర్ లు ఓపెన్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదివరకు లాగా సినిమా థియేటర్ మొత్తం ఫీల్ అయ్యేలా కాకుండా సీటు కి సీట్ కి మధ్య గ్యాప్ ఉండేలా థియేటర్ లో  సగం మాత్రమే ఫీల్ అయ్యేలా థియేటర్ లు ఓపెన్ చేయాలని యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నారట. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ తీసి వేసిన వెంటనే మరుక్షణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే నిశబ్దం, ఉప్పెన, ఒరేయ్‌ బుజ్జి, వి చిత్రాలతో పాటు పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటం ఆలస్యం థియేటర్ యాజమాన్యాలు కూడా ఓపెన్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారట.

 

ఇప్పటికే ప్రభుత్వాల నుండి సినిమా షూటింగ్లకు అనుమతులు రావడంతో...త్వరలోనే సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అవుతాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. మరోపక్క రిలీజ్ కావాల్సిన ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాలు మాత్రం ముందుగా సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్లు మరియు ప్రేక్షకుల రెస్పాండ్ బట్టి, సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలో లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలో అనే విషయంలో డిసైడ్ అవ్వాలని ఆలోచిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: