టాలీవుడ్ కి వారసులు కొత్త కాదు, ఇప్పటికి కొన్ని తరాలుగా వస్తూనే ఉన్నారు. అందులో చాలామంది తమ ప్రతిభను రుజువు చేసుకుంటున్నారు. కొంతమంది తెర వెనక్కుపోయిన వారూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా తండ్రి ఒక ప్రొఫెషన్ లో ఉంటే తనయుడు అదే ప్రొఫెషన్ లో ఉండడం తప్పు కాదు, ఓ విధంగా చెప్పాలంటే గొప్ప కూడా.

 

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో కొత్త వారసులపైన చర్చ సాగుతోంది. అందులో అందరికీ హాట్ ఫేవరేట్ గా నందమూరి బాలక్రిష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ణ గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. బాలయ్య ఆశ, ధ్యాస కూడా తనయుడి గురించే. తన తరువాత సినీ సీమను మోక్ష ఏలాలని బాలయ్య కలలు కంటున్నాడు. ఆయన కంటే ముందుగా ఫ్యాన్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. 

 

ఇవన్నీ పక్కన పెడితే మరో సీనియర్ హీరో వెంకటేష్ కుమారుడు కూడా సినీ రంగ ప్రవేశం చేస్తాడని వెంకీ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇపుడు టీనేజ్ లో ఉన్న వెంకటేష్ వారసుడు మరో రెండేళ్ళలో సిల్వర్ స్క్రీన్ ని పంచుకుంటాడని అంటున్నారు. వెంకటేష్ కూడా ఓ సందర్భంలో తన కుమారుడు వచ్చేవరకూ తాను నటిస్తాను అని ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు.

 

ఇక మరో వారసుడు చాలా ఇంటెరెస్టింగ్ క్రియేట్ చేస్తున్నాడు. అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా. అకీరా ఇపుడు టీనేజ్ లో ఉన్నాడు. పూణేలో కాలేజిలో చదువుతున్నాడు. బాగా పొడుగుగా ఉండే అకీరాలో హీరో మెటీరియల్ ఉందని పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కచ్చితంగా అకీరా వస్తాడని కూడా అంటున్నారు.

 

అలాగే మరో హీరో మహేష్ బాబు కొడుకు గౌతం క్రిష్ణ. ఈ మధ్యే తండ్రి ఎత్తుతో సమానంగా వచ్చిన గౌతం క్రిష్ణ కచ్చితంగా హీరో అవుతాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. అందానికి అందం సొంతం చేసుకున్న గౌతం మహేష్ వారసుడిగా వెండి తెరను ఏలే రోజులు ముందున్నాయని అంటున్నారు. చూడాలి వీరంతా రేపటి తరం హీరోలుగా ఎలా బాక్సాఫీస్ ని షేక్ చేస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: