డేరింగ్ అండ్ డాషీంగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి సౌట్ తో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఉన్న క్రేజ్.. ఇమేజ్ ఏ రేంజో అందరికీ తెలిసిందే.  హీరో ని క్లాస్ గా చూపించిన ఒక్కటి లేకపోవడం ఆశ్చర్యకరం. పూరి హీరోలందరూ బయట ఎంత సాఫ్ట్ గా ఉన్నా తన సినిమాలో మాత్రం పిచ్చ రఫ్ అండ్ మాస్ గా ఉంటారు. అంతేకాదు ప్రతీ కథ ని డిఫ్రెంట్ గా రాసుకొని ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఎన్ని హిట్స్ వచ్చాయో అంతకన్న ఎక్కువ ఫ్లాపులు వచ్చాయి. అయినా పూరి స్టామినా ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఇక వరసగా ఫ్లాప్స్ తో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చాడు.

 

ఇక పూరి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం ఒక కథ రాశాడని ఈ మధ్య సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.  అయితే సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవాతో రాధే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కభీ ఈద్..కభీ దివాళి అనే మరో సినిమాని కమిటయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ముందున్న టార్గెట్ ఈ రెండు సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడమే. ఇక పూరి విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి రెడీ అవుతాడు పూరి. ఇప్పటికే పూరి బాలయ్య మధ్య కథ కి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని త్వరలో అధికారక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. 

 

అయితే ఇంతలోనే పూరి సల్మాన్ ల సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చింది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో రూపొందే సినిమా అని కాని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అందులో  వాస్తవం లేదట. గతంలో సల్మాన్ ని హిట్ ట్రాక్ లోకి తీసుకు వచ్చిన సినిమా వాంటెడ్. ఈ సినిమా పూరి తెలుగులో తీసిన పోకిరి కి రీమేక్ కావడం విశేషం. దాంతో ఈ సారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్ట్రైట్ గా హిందీ సినిమా వస్తుందన్న న్యూస్ క్రియోట్ అయింది. బిగ్ బి అమితాబ్ తో ఇప్పటికే బాలీవుడ్ లో బుడ్డా హోగా తేరే బాప్ సినిమా రూపొందించి ఉండటంతో ఈ వార్తకి మరింత బలం చేకూరింది అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: