గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసల తోపాటు  కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది జెర్సీ సినిమా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. ఇక ఈసినిమాను హిందీ లోకి డబ్ చేసి ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేయగా  ఇప్పటివరకు 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది. అయితే  ఈ కల్ట్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతుంది. 
 
రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరే తెరకెక్కిస్తున్నాడు. హిందీలో అతనికిదే మొదటి సినిమా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు తో కలిసి అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.  ఈ చిత్రంలో షాహిద్ క్రికెటర్ గా కనిపించనున్నాడు.  
 
 షాహిద్ కోచ్ పాత్రలో తన తండ్రి పంకజ్ కపూర్ నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది ఆగస్టు 28 న ఈ సినిమా ను విడుదలచేయాలనుకున్నారు  కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుండడం తో ఈఏడాది చివర్లో  ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు. ఇక తెలుగు రీమేక్ లు షాహిద్ కు కలిసొచ్చేలా వున్నాయి. గత ఏడాది షాహిద్ కపూర్ ,ఖబీర్ సింగ్ తో వచ్చి సెన్సేషన్ సృష్టించాడు. అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం 250 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  మరి జెర్సీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: