అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దం థియేటర్స్ లోకి వస్తుందా.. లేదంటే.. ఓటీటీలోకి అడుగుపెడుతుందా.. దీనిపై  నిర్మాత కోన వెంకట్ గతంలో క్లారిటీ ఇచ్చినా.. ప్రస్తుతం ఆయన కూడా డైలమాలో ఉన్నారు. పరిస్థితులను బట్టి ఎటు అనుకూలంగా ఉంటే అటు దూకేందుకు రెడీగా ఉన్నారు నిర్మాత. 

 

అనుష్క నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం జనవరిలో రావాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ.. ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతలోనే కరోనా.. సినిమా రిలీజ్ ను అడ్డుకుంది. సిినిమా విడుదలై కన్ ఫ్యూజన్ నెలకొంది. థియేటర్స్ లోకి వస్తుందా.. లేదంటో ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తారా అనే టాక్ నడిచింది. ఇవన్నీ పుకార్లేనని నిర్మాత కోన వెంకట్ కొట్టి పారేశాడు. సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. 

 

నిశ్శబ్దం ఓటీటీ వార్తను చిత్ర నిర్మాత కోన వెంకట్ వారం క్రితమే వ్యతిరేకించారు. థియేటర్ లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే తమకు ప్రేరణ, ఆక్సిజన్. ఆ ఫీలింగ్ ను ఏదీ మ్యాచ్ చేయలేదు. సినిమా ఉంది సినిమా హాళ్ల కోసమే. అదే తమ ప్రాధాన్యమని కోన వెంకట్ ట్వీట్ చేశారు. అనుష్క థియేటర్స్ లోకి వస్తుందా.. ఓటీటీ రూపంలో ఇంట్లోకి వస్తుందా.. అనే డైలమాకు నిర్మాత తెరదించారు. అయితే లేటెస్ట్ ట్వీట్ మళ్లీ కన్ ఫ్యూజ్ రేపింది. 

 

కోన వెంకట్ నిశ్శబ్ధం రిలీజ్ పై రీసెంట్ గా చేసిన పోస్ట్ తో ఆయన వైఖరి మారినట్టు అనిపించింది. థియేటర్స్ లో రిలీజ్ చేయడమే ఫస్ట్ ప్రయారిటీ అనీ.. పరిస్థితులు అనుకూలించకపోతే.. ప్రత్యామ్నాయంగా ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నారు. గత స్టేట్ మెంట్ తో పోల్చుకుంటే వెనక్కి తగ్గారు నిర్మాత. జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా.. థియేటర్స్ ఓపెనింగ్ పై క్లారిటీ లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: