క‌రోనా దెబ్బ‌తో మొత్తానికి అంద‌రి జీవన విధానాలే మారిపోయాయి. 60 రోజుల లాక్ డౌన్ తరువాత దేశీయ విమానాలు ఈరోజు భారతదేశం అంతటా పున: ప్రారంభమయ్యాయి. సేవలను ప్రారంభించాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఏకంగా 25000 కోట్ల ఆదాయాన్ని నష్టపోయింది. ఇప్పుడు విమానాలు ప్రారంభంతో ఊపిరిపీల్చుకుంది. ఇక ఎప్పుడు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌తో కిక్కిరి సి పోయి ఉండే విమానాశ్ర‌యాలు రెండు నెల‌లుగా తెర‌చు కోక‌పోవ‌డంతో విమానా శ్ర‌యాల్లో అంతా నిశ్చ‌బ్దం రాజ్య‌మేలుతోంది.

 

ఇక ఇప్పుడు తిరిగి దేశీయ విమానాలు మొద‌లు కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప్ర‌యాణాలు షురూ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డిక‌క‌క్క‌డ తిరిగి షూటింగ్ లు ప్రారంభించు కోవాల‌ని ఆయా రాష్ట్రాల‌కు చెందిన సినిమా హీరోలు కూడా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు తిరిగి షూటింగ్ లు మొద‌లు పెట్టేందుకు కొద్ది రోజులుగా ప‌లువురు పెద్ద‌ల‌ను క‌లుస్తున్నారు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ‌కు చెందిన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఇంట్లో భేటీ అయ్యారు.

 

త‌ల‌సానితో ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ముందుగా రెండు సార్లు భేటీ అయ్యి అక్క‌డ షూటింగ్ లు తిరిగి ఎలా జ‌ర‌గాలో చ‌ర్చించారు. త‌ర్వాత వీరంతా సీఎం కేసీఆర్ ను కూడా క‌లిశారు. అటు కేసీఆర్ సైతం షూటింగ్‌లు ప్రారంభించుకునేందుకు ఒకే చెప్పారు. ఇక ఇప్పుడు ఇదే పెద్ద‌లు అంద‌రూ క‌లిసి మోడీని క‌లిసేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. దేశీయ విమానాలు మొదలయ్యాయి కదా మోడిని కలవాలని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌. ఈ ఆలోచ‌న ముందుగా చిరంజీవికి వ‌చ్చింద‌ని అంటున్నారు.

 

చిరంజీవి బీజేపీకే చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు.. త‌న‌కు స‌న్నిహితుడు అయిన సీఎం రమేష్ సహకారం తో ఈశాన్య రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ కి ఓకే చెప్పించాలి అని భావిస్తున్నాడ‌ట‌. ఇక చిరంజీవి కొత్త సినిమా ఆచార్య షూటింగ్ కూడా ఈశాన్య రాష్ట్రాల్లోనే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: