సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అది కాస్త సెన్సేషన్ గా మారి కూర్చుంటుంది. మియా మాల్కోవా తో సినిమా చేసిన తరువాత ఈయన పని అయిపోయిందని అని అనుకున్నారు అంతా. కానీ ఎవరు ఊహించని రీతిలో ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని భైరవ గీత గా రీమేక్ చేశాడు , లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలను తీసి మల్లి ఫామ్ లో కి వచ్చాడు వర్మా, లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లేక  వర్మ కాస్త కుద్దుగా ఉన్నాడు అని అనుకుంటే మియా మాల్కోవతో క్లైమాక్స్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి అభిమానులను షాక్ కి గురిచేశాడు త్వరలో ఆ సినిమా ను రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాడు. అదేవిధంగా గాంధీ జి ని చంపినా హంతకుడు గాడ్సే ని మంచివాడిగా చూపిస్తూ ఓ సినిమాను చేయాలనీ నిశ్చయించుకున్నాడు.

 

IHG

 

అనుకున్నదే తడవుగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. తాజాగా కొరోనా వైరస్ నేపధ్యం లో ఓ సినిమాను చేయాలనీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాను ఎవరు చిత్రీకరించని రీతిలో ఎవరికి తెలియని ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో ఉపగోగిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ సినిమా ఓ గొప్ప సినిమా కూడా అవుతున్నదని అయన చెప్పారు. ఈ చిత్రాన్ని గురించి అయన తన ట్విట్టర్ లో ...ఈ సినిమాకి “CORONAVIRUS” అనే పేరును ఖరారు చేశాము  👍ఇది పూర్తిగా లాక్డౌన్ వ్యవధిలో చిత్రీకరించబడింది💪. ఇది కరోనావైరస్ కి సంబందించిన  ప్రపంచంలోనే మొదటి చిత్రం అవుతుంది..మా నటులు మరియు సిబ్బంది సృజనాత్మకతను లాక్డౌన్లో కూడా లాక్ చేయలేరని నిరూపించారు.🙏ట్రైలర్ ని  26th సాయంత్రం 5 PM  కి విడుదల చేస్తున్నాము #CORONAVIRUSFILM  @shreyaset ..." అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: