తెలుగు సినిమాల్లో ఓ కథాంశం క్లిక్ అయితే కొన్నేళ్ల పాటు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇదే తరహాలో టాలీవుడ్ సక్సెస్ అయిన ఫార్ములా రాయలసీమ ఫ్యాక్షనిజం. ప్రతి సినిమాలో రెండు, మూడు కుటుంబాల ఆధిపత్యం, ఇరు వర్గాల పోరు, కక్షలూ ఎక్కువగా ఫోకస్ అయ్యేవి. కానీ.. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్న అనుచరులు.. అన్యాయమైతున్న వారి కటుంబాల పాయింట్ ను చూపించిన సినిమాలుగా గోపీచంద్ ‘యజ్ఞం’, ప్రభాస్ ‘మిర్చి’ ప్రత్యేకంగా నిలిచాయి.

 

 

గోపీచంద్ హీరోగా 2004లో వచ్చిన ‘యజ్ఞం’ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతోనే తెరకెక్కింది. ప్రేమకథకు ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరును జోడించి తెరకెక్కించారు. అయితే.. ఇదే వరుసలో కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలకు నాయకుల  అనుచరులు ప్రాణాలు కోల్పోవడం.. వారి కుటుంబాలు అన్యాయానికి గురి కావడం చూపించారు. ‘నాయకుల జీవితాలు బాగు చేయాలనే తపనతో మీ జీవితాల్ని పణంగా పెడుతున్నారు. మీ జీవితాలు బాగపరచుకుంటూ మీ కుటుంబ సభ్యలకు అండగా ఉండండి’ అంటూ గోపీచంద్ పాత్ర ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో హిట్ అయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాకు దర్శకుడు.

 

 

ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో ఇదే తరహాలో 2013లో వచ్చిన సినిమా ప్రభాస్ మిర్చి. ఈ సినిమాలో కూడా ఫ్యాక్షన్ గొడవలకు నాయకుల అనుచరులు ఎలా బలైపోతున్నారనే పాయింట్ ను అద్భుతంగా చూపించాడు కొరటాల శివ. చక్కటి పాయింట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు. సత్యరాజ్, ప్రభాస్ పాత్ర కూడా అనుచరుల కుటుంబాలకు అండగా ఉండేలా తీర్చిదిద్దాడు శివ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాయకుల గొడవల్లో అనుచరులు చనిపోకూడదనేది ఈ సినిమా థీమ్, ఇలా ఫ్యాక్షన్ సినిమాల్లో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలుగా యజ్ఞం, మిర్చి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల్ని మెప్పించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: