అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ టాప్ హిట్ గా మారడమే కాకుండా కొన్ని చోట్ల ‘బాహుబలి 2’ రికార్డులను కూడ బ్రేక్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనితో అల్లు అర్జున్ ఆలోచనలు మారిపోయి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ 3 యంగ్ హీరోల రేసులో బన్నీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ లాక్ డౌన్ పిరియడ్ ను చాల వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు అన్నవార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో చేయవలసిన తన ‘పుష్ప’ మూవీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈమూవీ తరువాత ఇప్పటికే లైన్ లో వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ రెడీగా ఉంది. ఈరెండు సినిమాలు పూర్తి కావాలి అంటే కనీసం ఒక సంవత్సర కాలం పట్టే ఆస్కారం ఉంది. అయితే ప్రస్తుతం బన్నీ ఆలోచనలు మాత్రం రాబోయే మూడు సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి చాల ముందు చూపుతో కొనసాగుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు బన్నీ ఈలాక్ డౌన్ పిరియడ్ లో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూనే దక్షిణాది సినిమా రంగానికి చెందిన అనేకమంది క్రియేటివ్ దర్శకులతో బన్నీ ఈలాక్ డౌన్ పిరియడ్ లో ఫోన్ లో టచ్ లో ఉంటూ తన భవిష్యత్ సినిమాలకు సంబంధించిన వ్యూహాలలో బిజీగా ఉన్నాడు అని టాక్. ఇందులో భాగంగా కోలీవుడ్ కు చెందిన మురగదాస్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రశాంత్ నీల్ లతో పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొరటాల శివ సురేంద్ర రెడ్డిలతో కూడ బన్నీ తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ముఖ్యంగా దర్శకుడు సురేంద్ర రెడ్డితో బన్నీ ఈమధ్య ఒక కథ విషయమై చాల లోతుగా చర్చలు చేస్తున్నారని అదేవిధంగా కొరటాల శివ ‘ఆచార్య’ తరువాత తనతో మూవీ చేసే విధంగా ఒత్తిడి చేస్తున్నాడని అంటున్నారు. దీనితో రానున్న రోజులలో టాప్ హీరోలకు టాప్ దర్శకులు దొరకకుండా అందరి దర్శకులు తన గ్రిప్ లో ఉండే విధంగా బన్నీ అనుసరిస్తున్న లేటెస్ట్ స్ట్రాటజీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: