జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా టెంపర్. అతని లో ఉన్న ఒక కొత్త కోణం ఆ సినిమా ఆవిష్కరించింది అనేది వాస్తవం. తారక్సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడ్డాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాలో ప్రతీ సన్నివేశంలో కూడా అతను జీవించాడు అనేది వాస్తవం. సినిమా హిట్ ఏ స్థాయిలో సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ముఖ్యంగా తారక్ నటనే సినిమాకు హైలెట్ గా నిలిచింది. తారక్ కాకుండా ఆ కథ కు ఏ హీరో అయినా సరే సరిపోయే అవకాశం లేదని చాలా మంది అన్నారు. 

 

ఇక సినిమాలో ఉండే కొన్ని మెసేజ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ముందు ఒక పోలీస్ ఆఫీస్ సీరియస్ గా లేకపోతే జరిగే ఘోరం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమా చూపిస్తుంది. ఒక మహిళ ప్రాణాలు ఏ విధంగా పోతాయి అనేది ఒక పోలీస్ సీరియస్ గా లేకపోతే అనేది చెప్పారు. ఇక ఈ సినిమాలో ఉండే  మరో మెసేజ్ ఏంటీ అంటే ఆడ వాళ్ళ మీద జరిగే ఘోరాలు నేరాల మీద ప్రతీ ఒక్కరు స్వచ్చందంగా ముందుకు రావాలి అనేది ఉంటుంది. ఇక నేరాలు చేసే వాళ్లకు సంబంధించి కోర్ట్ లు ఎప్పటికప్పుడు కఠిన చట్టాలతో ముందుకు వెళ్ళాలి అనేది ఈ సినిమా చూపిస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: