రాఖీ... జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన ఒక అద్భుతమైన సినిమా. టాలీవుడ్ లో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు చాలా విధాలుగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో జూనియర్ నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాల్లో అతను జీవించాడు. ఇక ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కూడా కొంత కొంత మందికి ఇంకా గుర్తుంది అనే చెప్పుకోవచ్చు. సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు సమాజం మీద కూడా ప్రభావం చూపించాయి అనే చెప్పుకోవాలి. 

 

ఒక ఆడపిల్లను పెళ్లి చేసి పంపించిన తర్వాత జరిగే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి... కొంత మంది మూర్ఖంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆడాళ్ళ మీద అత్యాచారాలు చేసి వేధించే వారిని చంపినా విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. వారిని సమాజంలో ఉంచ కూడదు అని ఈ సినిమా ద్వారా తారక్ ప్రేక్షకులకు చెప్పాడు. ఇక కోర్ట్ లు కూడా ఏ విధంగా ఉండాలి పోలీసులు ఏ విధంగా ఆలోచించాలి అనేది కూడా ఈ సినిమా ద్వారా చెప్పారు. 

 

ఆడాళ్ళ ప్రాణాలకు రక్షణ కరువు ఈ సమాజంలో అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. ఇక చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు భయం కూడా పుట్టించాయి అనే చెప్పవచ్చు. తారక్సినిమా ద్వారా మంచి నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతను చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కూడా. ఇక ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: