వెల్ రాజు దర్శకత్వం వహించిన విఐపి సినిమాలో సూపర్ టాలెంట్ ఉన్న హీరో, నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న నటుడు ధనుష్ హీరోగా నటించగా... అతని సరసన అమలాపాల్ నటించింది. విఐపి స్ట్రైట్ తమిళ సినిమా కాగా... దానిని పలు భాషలలో డబ్ చేసారు. తెలుగులో రఘువరన్ బీటెక్ అనే టైటిల్ తో విడుదల చేయగా... అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ధనుష్ రఘువరన్ అనే పాత్రలో నటించాడు. రఘువరన్ బీటెక్ పూర్తి చేసిన ఒక నిరుద్యోగి. తనకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నప్పటికీ... తన చదువుకి సంబంధించిన ఉద్యోగాన్ని మాత్రమే చేస్తానని పట్టుబట్టి ఇంట్లోనే కూర్చుంటాడు. 

 

తన తమ్ముడు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. దాంతో తన తండ్రి రఘువరన్ ని బాగా తిడుతుంటాడు. తమ్ముడు చక్కగా తిని బాగా ఎత్తు పెరిగాడని అతడు మాత్రం సరిగా తినకుండా ఎత్తు పెరగలేదని కూడా రఘువరన్ తండ్రి తిడుతుంటాడు. ఈ క్రమంలోనే అతనికి శాలిని(అమలాపాల్) పరిచయమవుతుంది. తర్వాత వాళ్లు ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ సమయంలోనే తన తల్లి భువన(శరణ్య) చనిపోతుంది. తన తల్లి అవయవ దానం వలన ఒక ధనిక కుటుంబ అమ్మాయి బతుకుతుంది. కృతజ్ఞతా భావంతో వాళ్లు రఘువరన్ ఓకే తనకు ఇష్టమైన ఇంజనీర్ ప్రాజెక్టును అప్పగిస్తారు. ఆ తర్వాత తను ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ తన ప్రాజెక్టును పూర్తిచేసి శభాష్ అనిపించుకుంటాడు. 

 

చిత్రంలో తల్లి కొడుకుల మధ్య చూపించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. నా కొడుకు ఎప్పటికైనా ప్రయోజకుడు అవుతాడనే నమ్మకంతో తల్లి ధైర్యం చెప్తుంది. చదువుకున్న చదువు కి సంబంధిత ఉద్యోగాన్ని మాత్రమే చేయాలని ఈ సినిమాలో అందరికీ అర్థమయ్యేలా చూపించబడుతుంది. ఇష్టమైన ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ పనిని తాము ధైర్యంగా చేస్తూ ముందడుగు వేయాలని కూడా ఈ చిత్రంలో చూపించబడుతుంది. ఏది ఏమైనా రఘువరన్ బీటెక్ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: