మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 జనవరి 11, 2017 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ కథని అందించగా... పరుచూరి బ్రదర్స్ సాయి మాధవ్ బుర్ర డైలాగులను సమకూర్చారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాధ్యతలు చేపట్టాడు. కోల్కతాలో కత్తి శీను(చిరంజీవి) నేరస్తుడిగా జైల్లో తన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒక క్రిమినల్ తప్పించుకుంటుండగా అతడిని పట్టుకునేందుకు కత్తి శీను పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు. 


సహాయం చేస్తూ చేస్తూ ఒకానొక సందర్భంలో తాను పోలీసుల నుండి తప్పించుకొని హైదరాబాద్ నగరానికి చేరుకొని ఆ తర్వాత బ్యాంకాక్ కి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఈ క్రమంలోనే అతను సుబ్బలక్ష్మి( కాజల్ అగర్వాల్) ని చూడడం, ఆమెపై మనసు పారేసుకోవడం జరిగిపోవడంతో స్థాన బ్యాంకాక్ కు వెళ్లాలని నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఆ తర్వాత కత్తి శీను లాగా కనిపించే శంకర్ అనే వేరొక వ్యక్తి తెరపైకి వస్తాడు. దాంతో కత్తి శీను శంకర్ ని జైల్లో వేసి తాను ఎంచక్కా తప్పించుకోవాలని అనుకుంటాడు. అలాగే 25 లక్షల రూపాయలను సంపాదించి బ్యాంకాక్ కి వెళ్లిపోవాలని కత్తి శీను అనుకుంటాడు. ఐతే శంకర్ చాలామంది రైతులకు వ్యవసాయ సాగు కోసం వాటర్ అందించడానికి ఒక అద్భుతమైన ప్రాజెక్టును కనుక్కుంటాడు. కానీ దాన్ని అమలు చేయాలంటే తన బయటే ఉండాలి. కత్తి శీను మాత్రం శంకర్ జైల్లో పడేలా చేస్తాడు. చిట్టచివరికి తనకు ఈ విషయం తెలిసిన వెంటనే అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు నీళ్లు అందించడానికే తన వంతు సహాయం చేస్తాడు.


అలాగే శంకర్ నుంచి నుండి విడిపించి ఇతర చెడ్డ వ్యక్తుల నుండి కూడా తనకు విముక్తి కలిగించి ప్రజలకు నీళ్లు అందేలా చేస్తాడు. ఆ తర్వాత కత్తి శీను ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అప్పుడు కత్తి శీను సుబ్బలక్ష్మి తో మాట్లాడుతూ నేను కేవలం కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు దాంతో సినిమా అయిపోతుంది. కత్తి శీను పాత్ర నుండి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తాను నేరస్తుడు అయినప్పటికీ తన బదులు ఒక మంచి వ్యక్తిని జైలుకు పంపించాలి అని తెలుసుకొని... నిస్వార్ధం చూపి ప్రజలకు మేలు చేయడానికి కత్తి శీను ఏమాత్రం నిర్మొహమాటం చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: