డిసెంబర్ 9, 2004 వ సంవత్సరంలో విడుదలైన ఆ నలుగురు చిత్రంలో రాజేంద్రప్రసాద్ కథానాయకుడు పాత్రలో నటించగా... అతనికి భార్యగా ఆమని కుమారులుగా రాజా, పింగ్ పాంగ్ సూర్య నటించగా... కోట శ్రీనివాసరావు రఘుబాబు, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రఘురామ్(రాజేంద్ర ప్రసాద్) నిస్వార్ధ పరుడైన వ్యక్తిగా, నీతి నిజాయితీ ఉన్న పాత్రికేయుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మనుషులంతా ఒక్కటేనని కులం మతం తో పనిలేదని నమ్ముతాడు రఘురాం. కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడానికి తన కుటుంబ విషయాలను కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు రఘురాం. తనకు వచ్చిన జీతాన్ని సగం కుటుంబానికి సగం ప్రజాసేవకు ఉపయోగిస్తాడు. ఒకానొక సమయంలో తాను పని చేస్తున్న పత్రికలో అర్థనగ్న చిత్రాలను ప్రచురించ వలసిందిగా పేపర్ ఓనర్ చెప్తాడు. కానీ ఎడిటర్ అయిన రఘురామ్ ఈ చిత్రాలను ప్రచురించడానికి ససేమిరా అంటాడు. ఆ చిత్రాలను ప్రచురించడానికి ఇష్టంలేక జాబ్ కి రాజీనామా చేసి అప్పడాలు అమ్ముతాడు. 


తన కుమారుడు సరైన ర్యాంకు సంపాదించలేక డబ్బులు కట్టి ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోవాలి అనుకుంటాడు. అందుకుగాను తన నాన్న రఘురాముని డబ్బులు అడిగితే తాను మాత్రం ఇవ్వకుండా కష్టపడి రామ్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చదువుకోని చెప్పేస్తాడు. అలాగే తన కుమారుడు ఎస్ ఐ పరీక్ష పాస్ కాగా... కొలువు వచ్చేందుకు లంచం కట్టాలని... డబ్బులు కావాలని పెద్ద కుమారుడు అడిగితే అందుకు కూడా రఘురాం ససేమిరా అంటాడు. దీంతో అతనికి ఇంట్లో వాళ్ళు శత్రువులు అవుతారు. రఘు రామ్ కి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె ఇద్దరు ముగ్గురు ని లవ్ చేస్తే రఘు రామ్ కి తెలిసి కూడా అతను చాలా ప్రశాంతంగా ఉండే ఆమెతో పెద్ద మనిషి తోటి మాట్లాడుతాడు. అలాగే తనకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కూడా చేస్తాడు. దీంతో తన సొంత భార్య అయిన భారతి(రేవతి) కూడా అతడికి వ్యతిరేకంగా మారుతుంది. 


ఈ విధంగా కుటుంబ సమస్యలతో బాధపడుతూనే మరోవైపు ప్రజాసేవకే తన ప్రాధాన్యత ఇస్తాడు రఘురాం. ఒకానొక సందర్భంలో తప్పనిపరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత యమకింకరులు తనని తీసుకుపోయేందుకు భూమి మీదకు రాగా... తన కుటుంబ సభ్యులు తాను చనిపోయినందుకు ఎలా బాధ పడుతున్నారో చూసేందుకు రఘురాం ఆత్మ స్వర్గానికి నరకానికి వెళ్లకుండా భూమి మీదనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఇంట్లో సభ్యులు మాత్రం ఒక్క కన్నీటిబొట్టు ను కూడా కార్చారు. కానీ బ్రతికున్నప్పుడు సహాయం చేసిన ఎన్నో వేలమంది అతన్ని చూడడానికి తరలివస్తారు. చివరకి కుటుంబ సభ్యులకు కూడా తమ తప్పు తెలుసుకొని చితికి నిప్పంటించారు. రఘురాం క్యారెక్టర్ నుంచి నిస్వార్థం, నిజాయితీ, నీతి, దయ జాలి లాంటి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: