శర్వానంద్ కెరీర్ లో వచ్చిన మంచి సినిమాల్లో శతమానం భవతి ది బెస్ట్ గా చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో శర్వా నటన ప్రేక్షకులను బాగా మెప్పిస్తే భార్యా భర్తలుగా జయసుధ ప్రకాష్ రాజ్ నటన బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఆ సినిమాలో వాళ్ళు ఇద్దరి నటనే ఎంతో హైలెట్ అయింది. భార్యా భర్తలుగా పిల్లలు మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమ సినిమా మొత్తం కూడా హైలెట్ అయింది. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు కనీసం తల్లి తండ్రులను చూడటానికి కూడా రావడం లేదని ఈ సినిమా లో ఉంటుంది. అందుకోసం వాళ్ళు విడాకులు తీసుకోవాలి అని అనుకుంటారు. 

 

వాళ్ళ పిల్లలకు సమాచారం ఇవ్వగానే వాళ్ళు హడావుడిగా వచ్చి తల్లి తండ్రులను పరామర్శించి వారి దగ్గరకు వచ్చి ప్రేమ చూపించకుండా ఎంత సేపు తమ తల్లి తండ్రులు విడాకులు తీసుకోవద్దు ని చెప్పడం అన్ని కూడా  ప్రేక్షకులకు ఏదో కొత్త సందేశాన్ని ఇచ్చాయి. ఏ స్థాయిలో ఉన్నా సరే తల్లి తండ్రులను మరవకూడదు అనేది ఈ సినిమాలో చాలా అందంగా చూపించాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఈ సినిమా తర్వాత శర్వానంద్ కి మంచి హిట్ అనేది రాలేదు. ఆ తర్వాత హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసాడు. 

 

ఇటీవల వచ్చిన జాను సినిమా కూడా అతనికి నిరాశనే మిగిల్చింది అని చెప్పవచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ఏ సినిమా చేస్తున్నాడు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్నకు మంచి పేరు వచ్చింది. ఆయన మంచి కథలతో సినిమాలు చేస్తూ వెళ్ళారు. అగ్ర హీరోలతో కూడా ఆయనకు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: