చిరంజీవి సినిమా కెరీర్ లో వచ్చిన మంచి చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే చిత్రం స్నేహం కోసం. విజయ్ కుమార్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాలో ఉండే కొన్ని పాటలు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను మెప్పించింది. స్నేహం కోసం అనే టైటిల్ ని ఏ విధంగా పెట్టారు అనేది ఆ సినిమా కథ అందులో ఉండే సన్నివేశాలు సార్ధకం చేసాయి అనేది వాస్తవం. ముఖ్యంగా చిరంజీవి విజయ్ కుమార్ నటన చూసిన ప్రేక్షకులు జేజేలు కొట్టారు. 

 

ఆ విధంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాలో స్నేహం కోసం ఏది అయినా చేయవచ్చు అని నిరూపించారు. స్నేహం కి ఎంత విలువ ఉంటుంది అని చిన్న నాటి నుంచి ఉన్న స్నేహితులు ఏ విధంగా ఉండాలి అనేది ఈ సినిమాలో ప్రత్యేకంగా చూపించారు. ప్రతీ సన్నివేశంలో కూడా చిరంజీవి తో పాటుగా విజయ్ కుమార్ తమ కెరీర్ లో అత్యుత్తమ నటన చూపించారు. చిరంజీవి తన స్థాయి ని తగ్గించుకుని ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. 

 

ఆయన సినిమాల కోసం తమిళ ప్రేక్షకు లు కూడా అక్కడి నుంచే ఎదురు చూడటం మొదలు పెట్టారు అనేది వాస్తవం. సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంది అంటే ఈ సినిమాను బాలీవుడ్ లో అమితాబ్ కూడా చెయ్యాలి అనుకునే స్థాయిలో. కాగా చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఒక రీమేక్ సినిమాను చేయడానికి సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: