టాలీవుడ్ లో వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సినిమాల్లో మంచి సినిమా సంక్రాంతి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ స్నేహ సహా శ్రీకాంత్ నటన చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఈ సినిమాలో వెంకటేష్ నటన ఒక అన్నయ్యగా చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. కథ లో ఉండే కోణం తో పాటుగా ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను మెప్పించింది. ఇది పక్కన పెడితే కుటుంబం మొత్తం ఏ విధంగా కలిసి ఉండాలి అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. 

 

అన్నాదమ్ముల మధ్య ఆవేశం కాదు ఆలోచన ఉండాలి భార్య మాటలు అన్ని సందర్భాల్లో కూడా నమ్మకూడదు అనే విధంగా ఉంది అని కొందరు కామెంట్స్ కూడా చేసారు. పెళ్లి అయిన కొత్తలో వాళ్లకు కాస్త స్వార్ధం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే ఆవేశం లేకుండా ఆలోచించాలి అని కూడా ఈ సినిమా చూపించింది. కాగా ఈ సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే సినిమా రాలేదు అనే చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కుటుంబ పెద్దగా వెంకటేష్ పోషించిన పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది. 

 

తమ్ముళ్ళను ప్రేమించే అన్నగా కూడా ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. కాగా వెంకటేష్ ఇప్పుడు నారప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఒక తమిళ సినిమా రీమక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్సినిమా చేస్తాడు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఒక వింటున్నారు అని ఏ సినిమా అనేది త్వరలోనే తెలుస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: