పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ నటన త్రివిక్రమ్ దర్శకత్వం ఆయన మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతో బాగా అలరించాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన నటన కు మంచి మార్కులు పడ్డాయి. ఇక నదియా ఆయనకు అత్తగా నటించారు. సినిమా మొత్తంలో ఆమె పాత్ర చాలా కీలకం. అయినా సరే ఎక్కడా కూడా ఆమె భయపడకుండా చాలా అందంగా నటించి మెప్పించారు అనే చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే... 

 

కూతురి ప్రేమ విషయంలో ఒక తండ్రి ఏ విధంగా వ్యవహరించాలి ఆవేశం ఉండకూడదు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. సినిమాలో ఆవేశ పూరిత సన్నివేశాలను చాలా అందంగా చూపించారు. తల్లి తండ్రుల మీద కోపం వచ్చినా సరే కూతురు దూరంగా ఉండకూడదు అదే విధంగా బంధాల్లో మొండి తనం అనేది ఉండకూడదు అనేది ఈ సినిమాలో చూపించారు. ఆవేశం ఉంటే నష్టం మినహా లాభం అనేది ఉండదు అనేది ఈ సినిమా చాలా అందంగా ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ తో పాటుగా అందరు నటులు కూడా చాలా బాగా నటించారు. 

 

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డారు. కాగా ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. రాబోయే రెండేళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చాల  బిజీ గా ఉంటారు. కాగా ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: