కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్, ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ విజయ్ దేవరకొండల పార్ట్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. అయితే ఐశ్వర్య తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ముందుగా తమిళ చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకున్నాకే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

 

అయితే ఆమె హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఎన్నో అవమానాలని ఎదుర్కొందట. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఆమె కొన్ని విషయాలని షేర్ చేసుకుంది. ఆ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి మీటూ ఉద్యమం ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ నుండీ మొదలుకుని, బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ అన్ని చిత్ర పరిశ్రమల్లో దీనిపై చర్చ నడిచింది.

 

ఎంతో మంది హీరోయిన్లు తాము కూడా లైంగిక వేధింపులకి గురయ్యామంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకున్నారు. అయితే ఇటీవల కొందరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటికీ ఉంటుందని, అయితే అది హీరోయిన్ల మీదే ఆధారపడి ఉంటుందని, హీరోయిన్లు వద్దనుకుంటే దాన్నుండి బయటపడవచ్చని పేర్కొన్నారు. అయితే తాజాగా ఐశ్వర్యా రాజేష్ ఈ క్యాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పింది.

 

ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు అవమానాలను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదు అని ఓ స్టార్ డైరెక్టర్ అన్నారు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు.  సినీ పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉందని నటీమణులను చాలా తక్కువగా చూస్తుంటారని కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: