తెలుగు చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న మహేష్ బాబు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు అంతకుముందు వరకూ విభిన్నమైన సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాలో ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు సినిమాలకు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతున్నాయి. దీంతో మహేష్ బాబు నటించిన సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

 


 అయితే ఇలా మహేష్ బాబు నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒకటి శ్రీమంతుడు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది . ఒక సంపన్నుల కుటుంబములో పుట్టిన మహేష్ బాబు.. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు  తెచ్చుకుంటాడు... అయినప్పటికీ దృఢసంకల్పంతో ఎలా ముందుకు సాగుతాడు అనేది శ్రీమంతుడు సినిమాలో చూపిస్తారు. 

 

 పేదలకు ఏదో చేయాలి... అనే ఒక సంకల్పంతో ఉంటారు మహేష్ బాబు. అదే సంకల్పంతో ఒకప్పుడు తన తండ్రి ఒక ఊరు బాగు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన సంకల్పాన్ని పక్కన పెట్టడం గురించి తెలుసుకున్న మహేష్ బాబు... తన సొంత ఊరికి వెళ్లి ప్రజల బాగు కోసం ఏం  చేస్తాడు ఎలాంటి సాహసాలు చేస్తాడు. ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ  ఊరిని ఎలా బాగు చేస్తాడు అన్నది శ్రీమంతుడు సినిమాలో చూపించి ఎంతో మందికి ఒక మెసేజ్ ఇచ్చాడు  మహేష్ బాబు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయింది. శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రముఖులు కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకొని బాగు చేయడానికి కూడా ముందుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: