మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రేక్షకులకు కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు  మాత్రమే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా వచ్చి  ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా మహర్షి. ఈ సినిమాలో ప్రేక్షకులకు కేవలం ఒక అంశానికి సంబంధించిన మెసేజ్  మాత్రమే కాదు... ఒకే సినిమాలో రెండు మూడు అంశాలకు సంబంధించిన మెసేజ్ లు ఇచ్చారు ప్రేక్షకులకి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ విద్యార్థి పాత్రలో నటిస్తాడు. అయితే ఈ సినిమాలో స్టూడెంట్ లుక్ తో అదరగొట్టిన మహేష్ బాబు... ఒక విద్యార్థి లక్ష్య ఛేదనకు ఎలా ఉండాలి అనేది చూపిస్తాడు. 

 


 తమ లక్ష్యాన్ని చేరుకొనే వరకూ ప్రతి విద్యార్థి పరిగెడుతూనే ఉండాలని... విజయం సాధించాక   సైలెంట్ గా ఊరుకోకూడదు అని ఎప్పుడూ పరిగెడుతూనే ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. అదే సమయంలో స్నేహం గొప్పతనం కూడా అందరికీ చాటిచెప్పాడు. తన కెరీర్ కోసం తన స్నేహితుడు ఏకంగా అతని కెరీర్ ని సైతం త్యాగం చేశాడు అని తెలిసి ఫ్రెండ్షిప్ గొప్పతనం తెలుసుకొని ఒక ఊరికి వస్తాడు.

 

 

 

ఇక అక్కడ తన స్నేహితుడికి సంతోషంగా ఉంచడానికే ఎన్నో చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. ఇలా ఎంత ఎదిగినా ఒదిగి స్నేహ బంధానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చూపించాడు మహేష్ బాబు. అదే సమయంలో అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని విదేశాలకు వెళ్లి పోయి ఉద్యోగాలు చేస్తే... చివరికి వ్యవసాయం చేసే వాడే కరువవుతాడు అంటూ ఏకంగా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం పంట పొలాల్లోకి వచ్చేలా  ప్రభావితం చేస్తాడు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: