తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలకు కొదవ లేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక సినిమా తెర మీదికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇక ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా విడుదలవుతోనే  ఉంటుంది అందుకే తెలుగు ప్రేక్షకులకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గదు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది  మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే . మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో సినీ ప్రేక్షకులకు ఎంతగానో ప్రభావితం చూపుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా చిరంజీవి నటించిన సినిమాలు చాలానే ఘన విజయాలు కూడా సాధించారు. 

 


 అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినప్పటికీ సినీ ప్రేక్షకులకు మాత్రం ఎన్నిసార్లు చూసినా ఒక ప్రత్యేక అనుభూతి కలిగించే సినిమా ఠాగూర్.  ఈ సినిమాలు చిరంజీవి నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో చిరంజీవి లంచగొండితనాన్ని నిర్మూలించే వ్యక్తిగా చేసే నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతేకాకుండా నువ్వు ఒకరికి సహాయం చెయ్ ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయమను...  ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయాలని చెప్పడం ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. 

 


 ఇక ఠాగూర్ సినిమా వచ్చిన చాలా రోజుల వరకు ఇలా.. చాలామంది ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో చిరంజీవి ఠాగూర్ సినిమాలో చెప్పిన ముగ్గురికి సహాయం అనే నినాదం ప్రేక్షకుల్లో బలంగా పాతుకు పోయింది. ఇప్పటికి కూడా అందరికీ సహాయం చేయాలనే భావన ఎంతో మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు చిరంజీవి చేపట్టే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. పూర్తిగా లంచగొండితనాన్ని నిర్మూలించి ప్రజల్లో దేవుడిగా మారిపోతాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఎన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులకు ఈ సినిమా మాత్రం ఎప్పుడు ఎవర్ గ్రీన్  గా ఉండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: