తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ కు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన‌ల్స్‌లో ఈ షో నడుస్తోంది. బిగ్ బాస్ షో ఈ ఏడాది నాలుగో సీజన్ లోకి ప్రవేశించింది. తొలి మూడు సీజన్లలో బిగ్ బాస్ రియాల్టీ షో అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి సీజ‌న్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ షో టీఆర్పీల ప‌రంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇక రెండో సీజ‌న్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. నాని కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ కార్యక్రమానికి వ‌న్నె తెచ్చార‌నే చెప్పాలి. ఇక మూడో సీజ‌న్‌కు హోస్ట్ గా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున వ్యవహరించారు.

 

ఇక తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకున్న ఈ రియాల్టీ షో నాలుగో సీజ‌న్ ఎప్పుడు ఉంటుందా ? అని అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ నాలుగో సీజ‌న్ కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ బుల్లి తెర పాపుల‌ర్ రియాల్టీ షో నాలుగో సీజ‌న్ ఆగ‌స్టు నుంచి ప్రారంభ మ‌వుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో అన్ని షూటింగ్ లు బంద్ అయ్యాయి. ఇక ఆగ‌స్టు అంటే మ‌రో రెండు నెల‌ల టైం ఉంది. ఈ లోపల అంద‌రు కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసుకుని ఆగ‌స్టు నుంచి షో ప్రారంభించాల‌ని మేనేజ్ మెంట్ నిర్ణ‌యం తీసుకున్నట్టు స‌మాచారం.

 

ఇక ఆగ‌స్టులో షో ప్రారంభ‌మైతే అంత‌కంటే ముందుగానే కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక ఈ షోలో నాలుగో సీజ‌న్ కు ఎవ‌రు హోస్ట్ గా ఉంటార‌న్న‌ది కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అయితే స‌స్పెన్స్ గా ఉంది. మ‌రి ఈ నాలుగో సీజ‌న్ ఎలా అల‌రిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: