బ్యూటీ ఒకప్పుడు హీరోయిన్.. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. చాలా మంది హంస నందిని హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. నిజానికి ఆమె పేరు హంసనందిని కాదు. ఆమె అసలు పేరు పూనమ్. ఈ బ్యూటీ మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. తాజాగా తన స్క్రీన్ నేమ్ జరిగిన కథలు అన్ని బయట పెట్టడం జరిగింది ఈ అందాల భామ. టాలీవుడ్ దర్శకుడు వంశీ, ఇళయరాజా కలిసి ఆ పేరు పెట్టారని తెలియజేసింది. 

IHG

వంశీ దర్శకత్వంలో నేను ఒక సినిమా చేశాను. అందులో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించారు. ఆ సినిమాలో నా పేరు పూర్తిగా... వంశీ గారు, ఇళయరాజా ఇద్దరూ కలిసి నాకు హంసనందిని అనే పేరు పెట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే... హంస అంటే అందమైనదని అని అర్థం వస్తుంది. వంశి గారు హంస అని చెప్పగానే ఇళయరాజా ఆ పేరు కాస్తా సవరించి హంస నందిగా సమకూర్చడం జరిగింది. అలా పూర్తిగా నా పేరు మారిపోయింది అంటూ పూనం తెలియజేసింది.

IHG

అలాగే తన పేరు వెనుక జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టింది. నిజానికి వంశీ నిర్మించిన అనుమానాస్పదం సినిమా కంటే ముందు హంస నందిని తెలుగులో రెండు సినిమాలు తీయడం జరిగింది. కానీ ఆ సినిమాలో ఆమె అసలు పేరునే వాడడం జరిగింది. హంస నందిని పరిచయం చేసింది మాత్రం వంశీ సినిమాతోనే అంటూ తెలియజేసింది పూనం. ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్, హీరోలు వారి పూర్తి పేరు కాకుండా మరో పేరుతో ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: