టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి ఈమధ్య కొద్దిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. భర్త సురేష్ తేజ మరణం ఆమెను బాధపెట్టగా కొద్దిపాటి గ్యాప్ తో మళ్ళీ సినిమాలు చేయాలని చూస్తుంది సురేఖా వాణి. అయితే సిల్వర్ స్క్రీన్ పై తల్లి, అక్క, వదిన పాత్రలతో చాల హోమ్లీ గా కనిపించే సురేఖా వాణి ఫోటో షూట్స్ లో మాత్రం చించేస్తుంది. హాట్ షోతో కుర్రాళ్ళ మతులుపోగొట్టే ఈ ఆంటీ ఇదంతా తన కూతురు కోసం చేస్తుందని తెలుస్తుంది. 

 

సురేఖా వాణి తనయురాలు సుప్రిత వెండితెరకు పరిచయం కాబోతుందని తెలుస్తుంది. అందుకే ఆమెను ముందుగా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తుంది సురేఖా వాణి. సురేఖాతో పాటుగా సుప్రిత కూడా తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఫోటో షూట్స్ తోనే ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న ఈ అమ్మడు తప్పకుండా సినిమాల్లో ఊపేస్తుందని అంటున్నారు. గ్లామర్ పాత్రలకు కూడా తాను ఓకే అనేలా హింట్ ఇస్తున్న సుప్రిత క్రేజీ సినిమాతో తెరంగేట్రం చేయాలని చూస్తుంది. 

 

సురేఖా వాణి కూడా తన కూతురు కెరియర్ విషయంలో ముందు జాగ్రత్తగా ఉందట. ఎలాగు సురేఖా వాణికి తెలుగులో మంచి డిమాండ్ ఉంది ఆమె అడిగితే సుప్రిత కు ఛాన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి సుప్రిత టాలీవుడ్ లో సత్తా చాటడం ఖాయమని చెప్పొచ్చు. టాలీవుడ్ లో హీరోల వారసులకు ఉన్న క్రేజ్, ఇమేజ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే వారసురాళ్లకు ఉండదు. మరి ఆ సెంటిమెంట్ తిరగరాసేలా సుప్రిత టాలెంట్ చూపిస్తుందో లేదో చూడాలి. సుప్రిత ఇప్పటికే సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుండగా సినిమాల్లో దుమ్ముదులిపేయడం ఖాయమని కొందరు అంటున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: