అక్కినేని వంశం నుంచి మూడో తరం హీరోగా తెరంగేట్రం చేసిన హీరో నాగ చైతన్య. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తనదైన నటనతో మొదటి సినిమా నుంచి ఆకట్టుకుంటున్నాడు. ఎక్కువగా యూత్ కంటెంట్, లవ్ సబ్జెక్టులే చేసాడు నాగ చైతన్య. కెరీర్లో తొలిసారి లవ్ సబ్జెక్ట్ కు ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా చేసి మెప్పించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఆ సినిమానే రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా విడుదలై నేటితో 3ఏళ్లు పూర్తయ్యాయి. పూర్తి కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

IHG

 

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2017 మే26న విడుదలైంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా వంటి హిట్ తర్వాత కల్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టే మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో చైతన్యకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకు రకుల్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తండ్రిపై ప్రేమతో నాగ చైతన్యను రకుల్ ఇబ్బంది పెట్టడం సినిమాలో కాస్త ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యమే సినిమా ప్రచారంలో భాగంగా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ ప్రమోట్ చేశారు.

IHG

 

శివగా చైతన్య, భ్రమరాంబగా రకుల్ పెయిర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నిన్నే పెళ్లాడతా మూవీ కంటెంట్ కు దగ్గరగా ఉంటుంది. చైతన్య, రకుల్ పాత్రలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించాడు. అక్కినేని అభిమానులకు ఈ సినిమా విజయం సంతోషాన్నిచ్చింది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: