బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్ లు పూర్తి చేసుకుంది. ఇక రాబోయే నాలుగవ సీజన్ పనులు మొదలుపెట్టారని తెలుస్తుంది. కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అవలేదు కానీ మాములుగా అయితే ఇప్పటికే రెండు మూడు లిస్ట్ లు లీక్ అయ్యి హడావిడి చేసేవి. అయితే మునుపటిలా కాకుండా ఈసారి బిగ్ బాస్ చాలా సీక్రెట్ గా ఉంచాలని చూస్తున్నారు. పూణేలో జరిగిన మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అక్కడ టెక్నీకల్ టీం ఎలాంటి లీకులు బయటకు రానివ్వలేదు. కానీ రెండు, మూడు సీజన్లు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయడం వల్ల ఎలిమినేట్ అయ్యే వారి దగ్గర నుండి అన్ని లీక్ అవుతూ వచ్చాయి. 

 

అందుకే ఈసారి మరింత స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారట. ఇక ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఫోన్ ద్వారా కంటెస్టెంట్స్ తో డిస్కషన్స్ చేస్తున్నారట. అంతేకాదు ఈసారి టాస్క్ లను కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ హౌజ్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సీజన్ హోస్ట్ ఎవరన్నది కూడా సస్పెన్స్ గా ఉంది. మొన్నటిదాకా ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ అవతారం ఎత్తుతారని అనుకోగా ఆర్.ఆర్.ఆర్ లేట్ అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ కు కష్టమని చెప్పాడట. 

 

ఇక సెకండ్ సీజన్ చేసిన నాని మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా చేయలేనని అప్పుడే చెప్పాడు. మూడవ సీజన్ హోస్ట్ గా చేసిన నాగార్జునని మళ్ళీ 4వ సీజన్ కు హోస్ట్ గా కొనసాగుతాడని అంటున్నారు. అంతేకాదు ఈసారి హౌజ్ మేట్స్ కూడా అందరు సెలబ్రిటీస్ నే తీసుకుంటున్నారట. మొత్తానికి బిగ్ బాస్ టీం ఈసారి పకడ్బందీ ప్లానింగ్ లో ఉన్నారు. మరి దీనికి సంబందించిన అప్డేట్స్ బయటకు రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: