ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది. అయితే ప్రేమ అందరి జీవితాల్లో పుట్టినట్టు చివరి వరుకు అందరి జీవితాల్లో ఉండదు. కొందరి జీవితాల్లో మొగ్గగా ఉన్నప్పుడే తుణిగిపోతుంది. అయితే అలాంటి అందమైన ప్రేమ పోయింది అని.. ఇంకా జీవితమే లేదు అని.. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. 

 

కొందరు బతికున్న శవాలులా జీవిస్తారు. అలాంటి వారికోసమే కొందరు దర్శకులు కొన్ని అద్భుతమైన చిత్రాలు తీశారు.. ఆ సినిమాలు చూస్తే నిజంగా వాళ్ళ కోసమే ఆ సినిమాలు తీశారు ఏమో అనే రేంజ్ లో ఉంటుంది. అవును.. జీవితంలో ప్రేమ అనేది చిన్న భాగం మాత్రమే. అది ఓడిపోయినా ఓ మంచి జీవితం ఉంటుంది. 

 

అదే ఆ సినిమాలలో చాలా అందంగా చూపించారు.. ఇంకా టాలీవుడ్ లో అయితే 1960 నుండి ఇప్పటి వరుకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ సినిమాలు చూస్తే జీవితం ఆశ పుడుతుంది. అప్పట్లో ప్రేమాభిషేకం, ఆతర్వాత నా ఆటోగ్రాఫ్, ఆతర్వాత రాజా రాణి, ఆతర్వాత ప్రేమమ్ మొన్నటికి మొన్న నిన్ను కోరి.. నిన్నటికి నిన్న మజిలీ. 

 

అన్ని సినిమాలు కూడా ప్రేమలో విఫలం అయినా యువత కోసమే.. అవును.. మనం ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు జీవితం ఎంతో అద్భుతంగా ఉహించుకుంటాం.. మనం ఉహించుకున్నవి అన్ని, కావాలి అని అనుకున్నవి అన్ని జరగవు.. అలానే ఇది కూడా జరిగి ఉండదు.. ఇందుకు ఓ రేంజ్ లో బాధపడి.. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టె కంటే అది ఒక కల లా మరిచిపోతే మంచి జీవితం నీ కళ్ళముందు ఉంటుంది.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: