దేవుడు అన్ని చోట్లా ఉండలేకనే అమ్మని సృష్టించాడు అని అంటుంటారు.. అవును నిజంగానే దేవుడు అలా సృష్టించాడు. అదే విజయ్ ఆంటోనీ కూడా బిచ్చగాడు సినిమాలో చెప్పాడు. బిచ్చగాడు సినిమా అమ్మకు అంకితం ఇవ్వచ్చు.. అమ్మ ప్రేమను.. అమ్మ విలువను ఎంతో చక్కగా అందంగా చూపించాడు విజయ్ ఆంటోనీ. 

 

బాబు పుట్టిన సమయం నుండి ఒంటరి తల్లి కొడుకును ఎంత జాగ్రత్తగా పెంచింది.. ఎంత ఉన్నత స్థాయిలో పెంచింది అనేది చూడకుండా వాళ్లకు కాళ్ళు రాగానే దేశాలు పట్టుకొని తిరుగుతున్న కొడుకులు ఉన్న రోజుల్లో.. తల్లి ప్రేమ కోసం.. తల్లి ఆయుషు కొద్దీ రోజులు పెంచాలి అని ఓ కోటీశ్వరుడు బిచ్చగాడి వేషం వేసి కొన్ని రోజులు పాటు అజ్ఞాతంలో బ్రతుకుతాడు. 

 

తల్లి కోసం ఇలా చేసే కొడుకులు ఉన్నారా? తల్లి ప్రేమ గొప్పదేలే కానీ కొడుకులు ఇంత వారు ఉంటారా? అని ఆశ్చర్యపరిచేలా చేసిన సినిమా బిచ్చగాడు. అంతేకాదు.. తల్లి ఉన్నప్పుడే ఆమె కంటి నుండి కన్నీళ్లు రాకుండా చూసుకోండి.. ఆమెను సంతోషంగా చూసుకోండి.. తల్లి మంచానా పడితే ఆమె ప్రేమను పొందలేరు అని చెప్పిన గొప్ప సినిమా బిచ్చగాడు. 

 

అలాంటి మంచి సినిమాను ఈ లాక్ డౌన్ లో చుడండి.. తల్లిని జాగ్రత్తగా ఆనందంగా చూసుకోండి. తల్లి కంటి నుండి ఒక్క చుక్క నీళ్లు కూడా రాకుండా చూసుకోవాలి.. అప్పుడే జీవితంగా అందంగా.. వాళ్ళకు పుట్టినందుకు ఒక అర్ధం ఉంటుంది. తల్లిని ప్రేమించలేని పిల్లలు పుట్టిన ఉపయోగం లేదు.. ఈ సినిమాను మరోసారి చూసి తల్లిపై కాస్త అయినా ప్రేమను చూపించండి కలికాలం కొడుకుళ్లురా.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: