టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత బాబు రేంజ్ అనేది ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట అక్షరాలా నిజం. అక్కడి నుంచి కూడా అతని తో సినిమాలు చేయడానికి అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ప్రభాస్ మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ ఏ మాత్రం కంగారు లేకుండా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. 

 

ఇక ఈ క్రమంలోనే అతను బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాను బాలీవుడ్ లో చేయడానికి అతను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి అక్కడి సినిమా దాదాపుగా ఖరారు అయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ ఒక అగ్ర దర్శకుడి తో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను మొదలు పెట్టడానికి పెద్దగా సమయం అవసరం లేదని ప్రభాస్ కూడా భావిస్తున్నాడు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి నో చెప్పినట్టు తెలుస్తుంది. ప్రభాస్సినిమా కోసం దీపిక పదుకునే అయితే బాగుంటుంది అని ఆమె తో చర్చలు కూడా జరిపాడు. కాని ఆమె మాత్రం ప్రభాస్ తో సినిమా చేయడానికి ముందు ఓకే చెప్పినా తర్వాత మాత్రం నో చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ని అడిగాడు అని ఈ సినిమాకు అతను నిర్మాత కూడా అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: