మన తెలుగులో సమంతాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప చేసే సినిమాలతో పాటుగా కొన్ని కొన్ని కామెంట్స్ ఆమె ఫోటో లు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సరే వచ్చే ఏడాది మొత్తం కూడా ఆమె సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె నిర్మాతగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఏ సినిమాకు నిర్మాతో గాని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. 

 

అది ఏంటీ అనేది చూస్తే... ప్రస్తుతం ఆమె తో సినిమా చేయడానికి బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆమెను అతను లక్కీ హీరోయిన్ గా భావిస్తున్నాడని కొన్ని రోజులుగా టాక్ వస్తుంది. అతనికి ఫ్లాప్ వచ్చిన సమయంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తో ఆమె మంచి హిట్ ఇచ్చింది అని అంటున్నాడు. అందుకే ఇప్పుడు ఆమెను పుష్ప సినిమాలో తీసుకోవడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప సినిమాలో ఆమెని తీసుకోవడానికి గానూ అతను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమెకు కచ్చితంగా ఒక పాత్ర ఇవ్వాలని సుకుమార్ మీద తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె కూడా ఇప్పుడు ఆ సినిమాలో నటించడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఆమె ఆ సినిమాలో ఏ పాత్ర చేస్తుంది అనేది తెలియదు గాని ఆమె ను మాత్రం కచ్చితంగా సినిమాలో తీసుకోవాలని ఆయన కోరినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని భావిస్తున్నా సాధ్యం అయ్యే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. మరి ఎప్పుడు చేస్తారో చూడాలి...  త్వరలో స్పష్టత వస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: