టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాల్లో వీరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కీలక పాత్రలు వారికి ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో కూడా వారికి మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పటి వరకు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న యాంకర్ రేష్మీ కూడా ఇప్పుడు సినిమాలను చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి స్టార్ హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. 

 

ఇప్పుడు ఆమెకు ఒక కీలక హీరో సినిమాలో అవకాశం వచ్చిందని అంటున్నారు. అదే విధంగా అగ్ర హీరో ఒకరు ఆమెకు తన సినిమాలో చెల్లిగా ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమెకు ఒక యాంకర్ ద్వారా ఆమె పరిచయం అయిందని ఆమె సినిమా ఛాన్స్ అడిగింది అని అందుకే ఇప్పుడు ఆమెను తన సినిమాలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆమెకు ఇప్పటికే సదరు హీరో చేసే సినిమా దర్శకుడి నుంచి ఫోన్ కూడా వెళ్ళింది అని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు షికారు చేస్తున్నాయి. 

 

ఇక ఆమె టీవీ షోస్ చేస్తూనే సినిమాలను కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. హీరోయిన్ గా ఆమె ట్రై చేసినా సరే ఆమెను వద్దు అని అన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆమె ఏ సినిమా చేస్తుందో చూడాలి. ఇక ఇప్పుడు ఆమె తో పాటుగా మరో యాంకర్ అనసూయ కూడా సినిమా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఆమె స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషించే ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆమెకు కూడా ఎవరు అవకాశం ఇస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: