మంచు మోహన్ బాబు. కలెక్షన్ కింగ్. ఆయన సినిమాల్లో ఫెరోషియస్ గా నటిస్తారు. తన నట విశ్వరూపమే చూపిస్తారు. అటువంటి మోహన్ బాబు నిజ జీవితంలో మాత్రం మంచుకన్నా  చల్లగా ఉంటారు.

 

మనసులో ఏముందో అది బయటకు కక్కేస్తారు. దాంతో ఆయన హ్యాపీగా ఉంటారు. ఎవరికీ ఏ రకమైన హానీ చేయని మోహన్ బాబు సినీ నటుడుగా శిఖరానికి  ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. ఇక అందరి కంటే భిన్నంగా ఆయన తాను సినిమాల్లో సంపాదించిన డబ్బుని విద్యా సంస్థను ప్రారభించడానికి ఉపయోగించారు.

 

తాను పుట్టిన నేల తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థను ష్తాపించి విద్యాబుద్దులు నేర్పుతున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప సేవ. ఇదిలా ఉండగా మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల వార్షికోత్సవానికి ఈసారి హాజరు కాలేకపోయారు. అంతే కాదు, ఆయన గత రెండు నెలలుగా హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. మరో విషయం ఏంటి అంటే ఆయన తాజాగా విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులతో ఆన్ లైన్లో మాట్లాడారు.

 

ఇలా ఆన్ లైన్లో మాట్లాడుతానని కలలో కూడా అనుకోలేదని మోహన్ బాబు అంటున్నారు. తాను స్వయంగా ఎపుడూ విద్యార్ధులను కలుసుకునే వాడినని కాసింత బాధపడ్డారు. కరోనా మహమ్మారి వల్ల తాను ఎక్కడికీ రాలేకపోతున్నానని చెప్పారు. ఇక విద్యార్ధులు తమ చదువులు చక్కగా చదవాలని, భవిష్యత్తు బాగా తీర్చిదిద్దుకోవాలని ఆయన కోరారు.

 

అంతా ఆన్ లైన్ లోనే విధ్యార్దులకు చదువులు చెబుతామని కూడా ఆయన అన్నారు. ఆ దేవుడు అనుగ్రహిస్తే తాను స్వయంగా శ్రీ విద్యానికేతన్ కి వచ్చి విద్యార్ధులను కలుసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి మోహన్ బాబు కలలో కూడా అనుకోలేదు అంటున్నారంటే ఆయన ఎంత బాధపడుతున్నారో అర్ధమైపోతోంది. ఏది ఏమైనా కరోనా వేళ సినీ సెలిబ్రిటీలు ఎలా ఆవేదన చెందుతున్నారో మోహన్ బాబు మాటలను బట్టి తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: