రెండు నెలల పాటు స్తంభించి పోయి మళ్లీ ఇప్పుడు ప్రారంభమవుతున్న సినిమాల చిత్రీకరణలు... సీరియళ్ల, వినోద కార్యక్రమాల షూటింగ్స్ కూడా వేగవంతంగా ముందుకు నడుస్తున్నాయి. దాంతో బుల్లితెర, వెండి తెర రంగాలలో పనిచేసే వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది సంతోషం మాత్రమే నీటిమీద రాతలు లాగానే మాయమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కొనసాగిన ప్రముఖ వినోద కార్యక్రమాలు ఇకమీదట త్వరలోనే ముగియనున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం భారతదేశ నలుమూలల కరోనా వ్యాప్తి బీభత్సంగా పెరిగిపోతుంది. 


ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు చిన్నపాటి సెలబ్రెటీల తో వినోద కార్యక్రమాలు, గేమ్ షోలు నిర్వహించడం దాదాపు ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. ఆమధ్య సూర్యాపేట జిల్లాలో కేవలం అష్టా చమ్మా ఆడినందుకే 31 మందికి కరోనా సోకింది. ఒకవేళ చాలా మంది పాల్గొనే టీవీ కార్యక్రమాలలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటే ఆ చానల్ ఖచ్చితంగా అభాసుపాలవుతోంది. అందుకే నిర్వాహకులు సామాన్య ప్రజలతో ఆడించే గేమ్ షో లను ముగించే ఆలోచనలో ఉన్నారు. 


ఈ మధ్యకాలంలో స్టార్ మాటీవీ లో ప్రారంభమైన లైఫ్ లో వైఫ్ అనే కపుల్ పాల్గొనే కార్యక్రమానికి యాంకర్ సుమ కనకాల హోస్ట్ గా బాధ్యతలను చేపట్టింది. ఐతే ఈ కార్యక్రమం కనీసం అయిదారేళ్ల పాటు కొనసాగించాలని మా టీవీ యాజమాన్యం భావించారట. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాము ఆ నిర్ణయాన్ని పునరాలోచించి లైఫ్ లో వైఫ్ షో కి ముగింపు పలుకుదామని సిద్ధమయ్యారు. 


కేవలం ఇది ఒక్క షో మాత్రమే కాదు యాంకర్ ఝాన్సీ హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టార్ పరివార్ లీగ్ కూడా త్వరలోనే ముగియనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు షూటింగ్ లేక ఎంతో నష్టపోయిన సుమ కనకాల, ఝాన్సీ యాంకర్లకు తమ షోలో అర్థంతరంగా ఆగిపోవడం వారికి ఒక రకంగా తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం వీళ్లిద్దరి కార్యక్రమాలు మాత్రమే కాదు మిగతా కార్యక్రమాలు కూడా ప్రస్తుత పరిస్థితుల కారణంగా త్వరలోనే ముగింపు కార్డు వేయనున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: