శ్రీదేవి ఎన్టీఆర్... టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన జంట ఇది. ఈ జోడి  సినిమా వస్తుంది అనగానే చాలా మందికి అప్పట్లో పిచ్చి కూడా ఎక్కింది. అప్పులు చేసి సినిమాలు చూసారు ప్రేక్షకులు అనేది  ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ సినిమాలు అనగానే జనాలకు ఒక  పిచ్చి అనేది అక్కడి నుంచే ఎక్కువగా అర్ధమై౦ది. వీరి కాంబినేషన్ అనగానే జనాలకు ఏదో తెలియని క్రేజ్ ఏర్పడింది. కొండవీటి సింహం, జస్టీస్ చౌదరి, వేటగాడు, ఇలా దాదాపు పది సినిమాల్లో ఇద్దరూ కూడా నటించారు. 

 

వీరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని పాటలకు ప్రేక్షకులు చప్పట్లో పాటుగా స్క్రీన్ మీద డబ్బులు కూడా విసిరారు అప్పట్లో. ఆ విధంగా ఒక రేంజ్ లో వీరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అనురాగ దేవత, బొబ్బిలి పులి, గజ దొంగ, రౌడి రాముడు కొంటె కృష్ణుడు, ఆటగాడు, అనురాగ దేవత, సింహం నవ్వింది, సత్యం శివం, సర్దార్ పాపారాయుడు వంటి సినిమా లు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ప్రతీ సినిమా కూడా ఒక రేంజ్ లో ఆడింది. ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. వీరి సినిమా ల్లో ఉండే పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. 

 

ఎన్టీఆర్ తో సినిమాల గురించి శ్రీదేవి తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకుల ను ఎంతగానో మెప్పించింది. టాలీవుడ్ లో ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఇంకా వారిని మర్చిపోలేదు. పాటల్లో డాన్స్ లు హైలెట్ అయ్యాయి. ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ హీరోయిన్ గా ఆమెనే చెప్తారు ప్రేక్షకులు. రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ శ్రీదేవి సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక పండగ. ఆ విధంగా వీరి కాంబినేషన్ చరిత్రలో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: