తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ కు గ్లామర్ కంటే ఎక్కువ టాలెంటే ఉందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కేవలం తన నటనా ప్రతిభ తోనే భారతదేశ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఏకైక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఐశ్వర్యా రాజేష్ తన జీవితంలో ఎదురైన సంఘటన గురించి అనేక ఇంటర్వ్యూలలో కలిపి అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఇటీవల ఆమె IIM తిరుచనాపల్లి, తమిళనాడు ఇన్స్టిట్యూట్ tedx నిర్వహించిన స్పీచ్ కార్యక్రమంలో దాదాపు 18నిమిషాల పాటు మాట్లాడి తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పింది. 

IHG
తాను చెన్నైలోని మురికివాడల్లో పెరిగానని చెప్పిన ఐశ్వర్య రాజేష్ ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు అని చెప్పి అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. నాన్న చనిపోవడంతో నలుగురు పిల్లల బాధ్యత నిరక్షరాస్యతులైన తన తల్లి మీద పడిందని... తన తల్లికి హిందీలో మాట్లాడడం రాదని ఒక్క తెలుగులో తప్ప అతనికి మిగతా ఏ భాషలో ఒక్క ముక్క కూడా పలకడం రాదని కానీ ముంబై మహానగరానికి వెళ్లి చీరెలు కొని అమ్మేదని ఆమె గర్వంగా వెల్లడించింది. తన కుటుంబంలో ఐశ్వర్య ఒక్కటే అమ్మాయి కాగా... మిగతా ముగ్గురు అబ్బాయిలే. 

IHG
చీరలు అమ్మడం మానేసిన తన అమ్మా ఎల్ఐసి ఏజెంట్ గా చేరి ఇప్పటికీ తన కో-యాక్టర్స్ కి ఎల్ఐసి పాలసీలు అమ్మడానికి ట్రై చేస్తున్నాను నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ కు పన్నెండేళ్ళ వయసు ఉన్నపుడు తన పెద్ద అన్నయ్య అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడట. తన పెద్దన్నయ్య ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని అమ్మాయి దంపతులు చంపేశారా లేకపోతేనే చనిపోయారు అనేది తమకు ఇంత వరకు తెలియదు అని చెప్పుకొచ్చింది. పెద్దన్నయ్య చనిపోయిన కొన్ని రోజుల్లోనే తన చిన్న అన్నయ్య కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

IHG

ఈ రెండు దుర్ఘటనతో తన తల్లి మానసికంగా కృంగిపోయిందని... దాంతో తాను పని చేసి డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి వచ్చిందని... ఆ సందర్భంలోనే ఒక చాక్లెట్ బ్రాండ్ కి సూపర్ మార్కెట్ వెలుపల నుంచొని ప్రచారం చేసానని చెప్పింది. తాను ఆ సమయంలో ఇంటర్మీడియట్ చదువుతున్నానని... మొట్టమొదటి జాబ్ చేసినందుకు రూ.225 రూపాయలు లభించాయని చెప్పింది. క్రమ క్రమంగా ఆమె రియాలిటీ టీవీ షోలలో పాల్గొనే డాన్స్ కాంటెస్ట్ లో గెలిచింది. సినిమాల్లో నటిస్తే గాని సీరియల్ యాక్టర్లకు రెమ్యూనరేషన్ పెరగదని తెలుసుకున్న ఆమె సినీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. మొట్టమొదటి సినిమా అవకాశం చేజిక్కించుకునేందుకు ఆమె ఎన్నో అవమానాలను చవిచూసింది. నీ కలర్ కి, నీ ఫిగర్ కి సినిమాల్లో పాత్రలు కావాలా తల్లి? అంటూ అవహేళన చేశారని... సినిమా అవకాశాలు రావాలంటే ఒక సారి రూమ్ కి రావాలి, ఏమంటావు? అని మొహం మీదనే అసభ్యకర వ్యాఖ్యలు చేశారని... ఎంతమంది తనని ఈసడించుకున్నారు అని ఆమె తెలిపింది. ఎవరైతే తనకు తమిళంలో ధారాళంగా మాట్లాడటం వస్తుందని తెలిసి చాలామంది తనని చీప్ గా చూసే వారని ఆమె తెలిపింది.


ఎట్టకేలకు తను మనసు నిబ్బరం చేసుకొని సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని... తన జీవితంలో నిలబడి ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా తన జీవితం నుండి ఎటువంటి నీతి పాఠము చెప్పానని చెబుతూనే... ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ ఆశయాలను అస్సలు వదిలేయకండి అని ఆమె విద్యార్థులందరికి చెప్పంది.

మరింత సమాచారం తెలుసుకోండి: