ఇండియన్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ సినిమా అనగానే ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలో నటించినా సరే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనం సృష్టించిన సినిమాలే కావడం విశేషం. ఆయన సినిమాల్లో ఫ్లాపులు చాల తక్కువగా ఉండేవి. సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం ఆయన సినిమాలకు కచ్చితంగా ఉండేది అనేది వాస్తవం. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు పని మానుకుని కూడా హాల్ కి వెళ్ళే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది అనేది అందరికి తెలిసిందే. 

 

ఇక ఆయన సినిమాల్లో సంచలనం సృష్టించిన సినిమా అడవి రాముడు. అడవి రాముడు సినిమా చూసిన ప్రేక్షకులు అయితే ఆయనకు సినిమా హాల్ లోనే దండం పెట్టారు అనేది వాస్తవం. ఎన్టీఆర్ ఆ విధంగా నటించి మెప్పించారు ఆ సినిమాలో. శ్రీదేవి తో ఆయన వేసిన డాన్స్ లు సహా ఆయన నటన ఆయన డైలాగులు కూడా ప్రేక్షకులకు ఇప్పటికి కళ్ళ ముందు ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన సినిమా అంటే ఒక పిచ్చి జనాలకు వచ్చింది ఆ సినిమా నుంచే. ప్రతీ ఒక్కరు కూడా అప్పుడు హాల్ కి వెళ్ళారు ఆయన సినిమాలను చూడటానికి. 

 

సినిమా అప్పట్లోనే మంచి విజయం సాధించింది. ప్రతీ సినిమాలో కూడా ఆయనను దేవుడిగా చూసారు. కాని ఆ సినిమాలో మాత్రం ఆయనను మళ్ళీ చూడలేము అనే విధంగా చూసారు వందల రోజులు ఆడింది ఆ సినిమాసినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో  ఆ రేంజ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించింది అనేది అర్ధం చేసుకోవచ్చు. అలా టాలీవుడ్ లో ఆ సినిమా ఒక సంచలనం.

మరింత సమాచారం తెలుసుకోండి: